ఆరు గ్యారంటీలు, 420 హామీలతో మభ్యపెట్టిన కాంగ్రెస్
ABN , Publish Date - Nov 28 , 2026 | 12:25 AM
కాంగ్రెస్ ఆరు గ్యారంటీల డిక్లరేషన్లు, 420హామీలతో తెలంగాణ ప్రజా నికాన్ని మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ శ్వేతపత్రం విడుద ల చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, ఎమ్మెల్సీ ఎల్ రమణ డిమాండ్ చేశారు.
సిరిసిల్ల, నవంబరు 27 (ఆంరఽధజ్యోతి): కాంగ్రెస్ ఆరు గ్యారంటీల డిక్లరేషన్లు, 420హామీలతో తెలంగాణ ప్రజా నికాన్ని మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ శ్వేతపత్రం విడుద ల చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, ఎమ్మెల్సీ ఎల్ రమణ డిమాండ్ చేశారు. శుక్రవారం సిరిసిల్లలో బీ ఆర్ఎస్ జిల్లా కార్యాలయ భవనంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎల్ రమణ మాట్లాడుతూ కరీం నగర్లో ఈనెల 29న జరిగే కేసీఆర్ దీక్షా దివస్ స్ఫూర్తి సభ విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర మే ధ్యేయంగా నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరాల ని, తెలంగాణ సాధనలో ముందుండి కేసీఆర్ ఉద్యమా న్ని నడిపించారన్నారు. కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ ఇస్తామన్న ఒప్పందంతోని కలిసి ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేశారని తెలిపారు. ఆనాడు ఉన్న కాంగ్రెస్ పాలకులు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకుండా, వాళ్ల రాజకీయ మను గడ, ప్రభుత్వ పరిపాలన కోసం సమయాన్ని కేటాయిం చారని, తెలంగాణ ఏర్పాటులో చిత్తశుద్ధి చూపలేదన్నా రు. ప్రజల ఆకాంక్షను సాధించాలంటే ఎంతటి త్యాగాల కైనా సిద్ధం కావాలని 2009 నవంబరు 29న అకుంఠిత దీక్ష, సత్సంకల్పంతో కేసీఆర్ మరొకసారి తెలంగాణ ఉద్య మాన్ని ఉధృతం చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ సాధించుకోవడానికి సాహసోపేతంగా ఆమర ణ దీక్షకు సిద్ధమై బయలుదేరితే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా, దీక్ష కొనసాగించారన్నారు. దీక్ష కొనసాగింపుతో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలం గాణ ప్రకటన కేసీఆర్ చేయించిన సందర్భంలో సీమాం ధ్ర పాలకులు ఆ ప్రకటనను అడ్డుకునే విధంగా ఎన్నో కుట్రలు చేశారన్నారు. ప్రజానీకాన్ని అంతా కూడా సకల వర్గాలను ఐక్యమత్యం చేసి సాధించుకున్న తెలంగాణను చూస్తున్నామన్నారు. ఏ లక్ష్యంతో తెలంగాణ సాధించుకు న్నామో దాన్ని నెరవేర్చాలని 10సంవత్సరాలు నిర్విరా మంగా ప్రభుత్వ పాలన కొనసాగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజానికాన్ని మ భ్యపెట్టి, ప్రలోభపెట్టి అధికారంలో కి వచ్చిన మూడు సంవత్సరాలలో వాళ్లు చేయవలసిన పనులు చేయ కుండా కేసీఆర్, కుటుంబంపై విమ ర్శిస్తూనే కాలం గడుపుతున్నారని అన్నారు. వాళ్ల హామీల అమలుపై చర్యలు చేపట్టడం లేదని విమర్శిం చారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అప్పులతో ముందుకెళ్తూ ప్రతి కుటుంబానికి రూ 15 లక్షల ఇస్తామని చెప్పిన హామీని నిలబె ట్టుకోలేదని, ఏటా 2కోట్ల ఉద్యోగాల హామీని నిలబెట్టుకోలేదన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్య క్షుడు తోట ఆగయ్య మాట్లాడుతూ కరీంనగర్లో జరిగే దీక్షా దివస్ స్ఫూర్తి సభకు భారీగా తరలివచ్చి విజయ వంతం చేయాలని కోరారు. జిల్లా నుంచి 25వేల నుంచి 30వేల వరకు దీక్షా దివస్‌కు తరలివెళ్తున్నామని తెలి పారు. కేసీఆర్ దీక్షా దివస్స్ఫూర్తి సభకు మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా వస్తున్నట్లు తెలిపారు. సమావే శంలో జడ్పీ మాజీ చైర్పర్సన్లు తుల ఉమ, అరుణ, బీ ఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, సెస్ చైర్మన్ చుక్కల రామారావు, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపా ణి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొల్లి రామ్మోహన్, కృష్ణారెడ్డి, రాజన్న, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.