ఢిల్లీలో అరెస్టులపై కాంగ్రెస్ నేతల నిరసన
ABN , Publish Date - Jul 22 , 2026 | 11:48 PM
ఢిల్లీలో లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులను అరెస్టు చేయడానికి ఖండిస్తూ కాంగ్రెస్ నేతలు కదిలివచ్చారు.
సిరిసిల్ల, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులను అరెస్టు చేయడానికి ఖండిస్తూ కాంగ్రెస్ నేతలు కదిలివచ్చారు. ప్లకార్డుల తో శాంతియుత నిరసన నిర్వహించారు. బుధవారం ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్ వద్ద కాంగ్రెస్ నేతలు శాంతియుత నిరస న చేపట్టారు. మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చా రు. గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీని వాస్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, గ్రంథాల య సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణలు కాంగ్రెస్ నేతల అరెస్టుల ను ఖండిస్తూ, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు మూడు గంటలపాటు కేంద్ర ప్రభుత్వ తీరుపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీని వాస్ మాట్లాడుతూ లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడం దారుణమైన చర్య అన్నారు. నీట్ పరీక్ష లు లీకేజ్‌కి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా ఎంతో మంది ఆందోళనలు చేస్తున్నా మోదీ, అమిత్‌షాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవ హరిస్తున్నారని, బీజేపీ నాయకులు ఒంటెద్దు పోకడలతో ముందుకు పోతున్నారన్నారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తే వారిపై లాఠీలతో విచక్షణ రహితంగా దాడి చేయడం దారుణమ న్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ముసుగులో దేశంలో పరిపాలన చేస్తోందని అన్నారు. రాహుల్ గాంధీపై దాడి చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని, బీజేపీ నాయకులకు నైతిక విలువలు లేవన్నారు. నీట్ పరీక్షల లీకేజీలతో ఎంతో మంది విద్యార్థులు బాధపడుతున్నారన్నారు. ఆనాడు రాష్ట్రంలో బీఆర్‌ఎస్, నేడు దేశంలో బీజేపీ పరీక్షలు లీక్ చేశా యని, రానున్న రోజుల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను జైల్లో పరామర్శించడానికి సోనియాగాంధీ వెళితే పోలీసులు అడ్డుకున్నారన్నారు. 12సంవత్సరాల బీజేపీ పాలనలో పేదలకు ఉపయోగపడే పథకాలు తీసుకురాలేదని, ఉపాధిహామీ పథ కం రద్దు చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులకు కేంద్ర ప్రభు త్వం అడ్డుపడుతుందన్నారని, అయోధ్య రాముడి పేరుతో అధికారంలో కి వచ్చి దేవాలయంలో దోచుకున్నారని, అయోధ్య కేసులో సీబీఐ విచా రణ నిష్పక్షపాతంగా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కోఆర్డినేటర్ ఫక్రుద్దీన్, వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్లు స్వరూపరెడ్డి, రాజు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చంద్రకళ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుస రవీందర్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు, జిల్లా అధ్యక్షుడు ప్రదీప్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సూర్య దేవరాజు, కాంగ్రెస్ నాయ కులు ఏండీ రియాజ్, బొప్ప దేవయ్య, ఎండీ రియాజ్, నర్సయ్య, వివి ధ మండల అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు తదితరులు పాల్గొన్నారు.