Share News

మోసం చేయడం కాంగ్రెస్‌ నాయకులకు అలవాటు

ABN , Publish Date - Mar 12 , 2026 | 12:18 AM

ప్రజలను నమ్మించి మోసం చేయడం కాంగ్రెస్‌ నాయకులకు అలవాటుగా మారిందని మానకొండూర్‌ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు.

మోసం చేయడం కాంగ్రెస్‌ నాయకులకు అలవాటు

ఇల్లంతకుంట, మార్చి 11( ఆంధ్రజ్యోతి): ప్రజలను నమ్మించి మోసం చేయడం కాంగ్రెస్‌ నాయకులకు అలవాటుగా మారిందని మానకొండూర్‌ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు. పెద్దలింగాపూర్‌ గ్రామసమీపంలో రైతులు చేపట్టిన నిరసనదీక్ష బుధవారానికి 29వ రోజుకు చేరగా మాజీ ఎమ్మెల్యే సంఘీభావం ప్రకటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం రైతులు నిరపన చేపట్టగా నిధులు మంజూరు అయ్యాయని హమీలు ఇచ్చారని, ఇంతవరకు తట్టెడు మట్టిని తీయలేదన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్మంచిన ఎల్‌ఎమ్‌ 6కెనాల్‌ కేవలం 1.5కిలోమీటర్ల పరిధిలో మాత్రమే ఎన్నికల కోడ్‌ రావడంతో పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. 10వేల ఎకరాలకు సాగునీరు అందించే కెనాల్‌ నిర్మాణం కోసం రైతులు నిరసన తెలుపుతున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులు ఏడ్చినచోట రాజ్యం నిలువదన్నారు. కెనాల్‌ నిర్మాణం పూర్తికాకపోవడంతో ప్రతి సంవత్సరం రైతుల పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. రైతులకు అండగాబీఆర్‌ఎస్‌ ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం పెద్దలింగాపూర్‌ గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు బాలయ్య ఇటీవలే మృతిచెందగా కుటుంబీకులను పరామర్శించారు. కార్యక్రమంలో జడ్పీమాజీ వైస్‌చైర్మన్‌ సిద్దం వేణు, ఉపసర్పంచ్‌ ఎలవేని రమేష్‌, నాయకులు గొడిశెల జితేందర్‌గౌడ్‌, గన్నారం నర్సయ్య, మీసరగండ్ల అనీల్‌కుమార్‌, పసుల బాలరాజు, ఉడుతల వెంకన్న, సుధాకర్‌రెడ్డి, బొల్గం వెంకటేశం, వొల్లాల రవీందర్‌, బిక్షపతి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2026 | 12:18 AM