Share News

అభివృద్ధి, సంక్షేమంలో కాంగ్రెస్‌ నంబర్‌వన

ABN , Publish Date - May 01 , 2026 | 12:22 AM

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం లో నంబర్‌ వనగా ఉందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు.

అభివృద్ధి, సంక్షేమంలో కాంగ్రెస్‌ నంబర్‌వన
లబ్ధిదారులకు నూతన వసా్త్రలను అందజేస్తున్న ఎమ్మెల్యే సంజయ్‌

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌

జగిత్యాలరూరల్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం లో నంబర్‌ వనగా ఉందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు. జగిత్యాల రూరల్‌ మండలంలోని బాలపల్లి గ్రామంలోని బేతిరెడ్డి భూమరెడ్డి దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశానికి గురువారం హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే నూతన పథకాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అంకురార్పణ చేసిందని తెలిపారు. గ్రామంలో 40 మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామన్నారు. బాలపల్లి, హైదర్‌పల్లి రోడ్డు అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని, గ్రామాల్లో డ్రైనేజీలు లేనిచోట నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తానని పేర్కోన్నారు. రైతు సంక్షేమం కోసం ఏకకాలంలో రుణమాఫీ, రైతు భరోసాను కాంగ్రెస్‌ అమలు చేసిందన్నారు. అనంతరం పొరండ్ల సర్పంచ హరీష్‌ రోడ్డుప్రమాదంలో గాయపడగా ఎమ్మెల్యే పరామ ర్శించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన నారాయణరెడ్డి, నాయకులు బాలముకుందం, సర్పంచ బొడ్డుదామోదర్‌, రత్న, నాయకులు గంగారెడ్డి, మహేష్‌, మల్లేష్‌, సురేష్‌, గణేష్‌, మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2026 | 12:22 AM