Share News

హామీలు అమలు చేయని కాంగ్రెస్‌ ప్రభుత్వం

ABN , Publish Date - Feb 04 , 2026 | 12:42 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండు సంవత్సరాల ప్రజా పాలనలో ఇచ్చిన హామాలను అమలు చేయలేక చతికిల పడిపోయిందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు.

హామీలు అమలు చేయని కాంగ్రెస్‌ ప్రభుత్వం

సిరిసిల్ల టౌన్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండు సంవత్సరాల ప్రజా పాలనలో ఇచ్చిన హామాలను అమలు చేయలేక చతికిల పడిపోయిందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రం తెలంగాణ భవనంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిరిసిల్ల మున్సిపల్‌ ఎన్నికలలో కేసీఆర్‌, కేటీఆర్‌, కారు గుర్తుకు ఓటు వేస్తామని ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కేటీఆర్‌ సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిగా ప్రజలతో మ మేకమైన నాయకుడు స్థానికంగా ఉన్నాడని వార్డుల వారిగా ప్రజల, బీఆర్‌ ఎస్‌ నాయకుల అభిప్రాయాలను తీసుకోవడం జరిగిందన్నారు. 39 వార్డుల్లో అభ్యర్థుల పరిశీలన జరిపాడన్నారు. 39 వార్డులో అభ్యర్థులను నిలబెట్టలేక పోటి పడలేక వెనకడుగు వేసిన కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల భవిష్యత్తు కొద్ది రోజుల్లో తేటతెల్లమవుతుందన్నారు. అబద్ధాల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఓటు వేస్తారా..?పది సంవత్సరాలు అభివృద్ధి చేసిన కేసీఆర్‌, కేటీఆర్‌కు ఓటు వేస్తారో ప్రజలు నిర్ణయించుకోబోతున్నారన్నారు. తప్పకుండా కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీ పార్టీకి ఈ ఎన్నికల్లో నిరాశ ఎదురు అవుతుందని మోజార్టీ వార్డు కౌన్సిలర్లు గెలిచి సిరిసిల్ల మున్సిపల్‌పై బీఆర్‌ఎస్‌ జెండా ఎగరబోతుంద న్నారు. సిరిసిల్ల నేతన్న కార్మికులకు నాడు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేసీఆర్‌, కేటీఆర్‌ అమలు చేసిన సంక్షేమ పథకాలు, సబ్సిడీలు నేటికి అమలు జరుగు తున్నాయని అన్నారు. ఈ సమావేశంలో టెస్కాబ్‌ మాజీ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, సీనియర్‌ నాయకులు చీటి నర్సింగరావు, బొల్లి రామ్మోహన్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 04 , 2026 | 12:42 AM