పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండ..
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:29 AM
గత ప్రభుత్వ హయంలో పేద ప్రజలకు అన్యాయం జరి గితే ప్రజా ప్రభుత్వంలో నిరుపేద ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి అండగా నిలిచాడని వేములవాడ ఎమ్మె ల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయంలో పేద ప్రజలకు అన్యాయం జరి గితే ప్రజా ప్రభుత్వంలో నిరుపేద ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి అండగా నిలిచాడని వేములవాడ ఎమ్మె ల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పట్టణం లోని ఆర్టీసీ డిపో వద్ద నిర్మాణంలో ఉన్న ఇందిర మ్మ ఇంటి నిర్మాణ పనులను, మూడు బ్రిడ్జి నిర్మాణ పనులను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భం గా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేస్తా మని చెప్పి మోసం చేసిందన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని, 144మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ఇంది రమ్మ ఇళ్ల నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. రూ.5 కోట్ల పైచిలుకు నిధులతో వాటి నిర్మాణం శరవేగం గా జరుగుతుందని, లబ్ధిదారులు స్వయంగా వచ్చి ఇంటి నిర్మాణం పర్యవేక్షిస్తూ ఆనందంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 4లక్షలకు పైగా ఇంది రమ్మ ఇళ్లు మంజూరు చేసిందన్నారు. ప్రతి నియోజ కవర్గానికి 3500ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడం గొప్ప విషయమని తెలిపారు. పట్టణంలోని బిడ్జిల నిర్మాణాన్ని 2015లో చేపట్టారని మూడో బ్రిడ్జి పను లు మధ్యలోనే వదిలేశారని విమర్శించారు. పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువస్తామని వివరించారు.
పట్టణాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం
రాజన్న ఆలయాభివృద్ధి, పట్టణాభివృద్ధిలో ప్రజల ను భాగస్వామ్యం చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని పలు కుల సంఘా ల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మంజూరైన పత్రా లను ఆదివారం అందజేశారు. భగవంతరావునగర్ రోడ్డులో సీసీరోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన చేయగా పట్టణంలోని ద్వారకనగర్‌లోని చర్చీలను సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పట్టణా న్ని ఆధ్మాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యం గా పనిచేస్తున్నట్లు తెలిపారు. అన్ని రకాలుగా పట్ట ణాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. 28 వార్డుల కు సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు నిధులు మం జూరయ్యాయని తెలిపారు. ప్రజా ప్రభుత్వం సర్వ మత సమ్మేళనానికి ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. సాటి మనుషుల మధ్య ప్రేమ, సమాజశాంతి ఏసు క్రీస్తు మానవాళికి అందించిన గొప్ప బోధన అన్నా రు. పట్టణంలోని రూ.1.30 కోట్లతో క్రిస్టియన్ భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింద ని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్ కాంగ్రెస్ నాయకులు సంద్రగిరి శ్రీనివాస్, పుల్కం రాజు, గూడూరి మధు, కొక్కుల రాజు,బింగి మహేష్, సాగరం వెంకటస్వామి, సిర్రం ప్రసాద్ యాదవ్ తదితరులు ఉన్నారు.