మహిళల ఆర్థికాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి
ABN , Publish Date - Aug 05 , 2026 | 11:33 PM
మహిళల ఆర్థికాభివృద్ధి, సాధికా రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
చందుర్తి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): మహిళల ఆర్థికాభివృద్ధి, సాధికా రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండలం మర్రిగడ్డలో మహిళా సమైక్య భవనాన్ని, మూడు లక్షలతో ఏర్పాటు చేసిన మంచినీటి శుద్ధజల కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం అంగన్‌వాడీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలకు శాశ్వత భవనాల నిర్మాణం చేపడుతున్నామన్నారు. గతంలో మహిళా సంఘాల సమావేశాలకు సరైన వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొనే వారని, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు ప్రత్యేక భవనా లు నిర్మించి వారి కార్యకలాపాలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నా మన్నారు. మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో వడ్డీ రాయితీలు, రూ.20లక్షల వరకు రుణాలు, బ్యాంకుల ద్వారా భారీ స్థాయిలో రుణ సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.57వేల కోట్ల రుణాలను మహిళా సంఘాలకు అందజే స్తున్నామని వెల్లడించారు. మహిళా సమాఖ్యలు ముందుకు వస్తే రైస్ మిల్లులు, సోలార్ పవర్ ప్రాజెక్టులు, బస్సుల నిర్వహణ వంటి ఆదాయ వనరులు కూడా కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించే చర్యల్లో భాగంగా నాణ్యమైన బతుకమ్మ చీరలను అందిస్తోందన్నారు. వేములవాడ నియో జకవర్గ అభివృద్ధికి రాజన్న ఆలయ అభివృద్ధి, రహదారుల విస్తరణ, వంతెనల నిర్మాణం తదితర పనులకు భారీ నిధులు తీసుకొచ్చామని, రాబోయే రోజుల్లో గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులు తీసుకువ చ్చి ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్య క్రమంలో సర్పంచ్ దూది మనీషా-శ్రీనివాసరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుందరెడ్డి, తహసీల్దార్ భూపతి, ఎంపీడీవో రాధా, డీపీఎం శ్రీనివాస్, ఏపీఎం కళ్యాణి,ఐసీడీఎస్ సూపర్వైజర్ శంకరమ్మ, ఉపసర్పం చ్ ఏరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, ఏఎంసీ వైస్‌చైర్మన్ బొజ్జ మల్లేశం, నాయకులు నాగం కుమార్, పొద్దుపొడుపు లింగారెడ్డి, గొట్టే ప్రభాకర్, చింతపంటి రామస్వామి, ధర్మపురి శ్రీనివాస్, ఇందూరి మధు, చిలుక బాబు, పులి సత్తయ్య, బాలు, ఆదిత్య, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.