Share News

కాంగ్రెస్‌ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల పక్షం

ABN , Publish Date - Apr 26 , 2026 | 12:32 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎప్పుడు బడుగు, బలహీన వర్గాల పక్షవేు ఉటుందని వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల పక్షం

వేములవాడ, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎప్పుడు బడుగు, బలహీన వర్గాల పక్షవేు ఉటుందని వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. ఆర్టీసీ కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమైన సందర్భంగా శనివారం కార్మికులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆది శ్రీనివాస్‌ను కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విప్‌ మాట్లాడుతూ ఎన్నో యేళ్లుగా పెండింగ్‌లో వున్న సమస్యలకు ముగింపు పలకడం శుభపరిణామం అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు మంత్రుల బృందం కార్మికులతో చర్చలు జరిపి మూడు రోజుల్లోనే సమస్య పరిష్కారానికి మార్గం చూపారన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ఏమాత్రం పట్టించుకోలేదని, 56 రోజుల పాటు సమ్మె చేసి 30 మంది కార్మికులు మరణిస్తే పట్టించుకోలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం మూడు రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే అనుకూలంగా మలుచుకునే ప్రయ త్నం చేశారని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల సంక్షేమ ధ్యేయంగా ముందుకుపోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌ జీపి సింగ్‌, వైస్‌ చైర్మన్‌ ప్రవీణ్‌ నాయకులు లక్ష్మణ్‌, కాళిదాసు, శ్రీకాంత్‌, శ్రీనివాస్‌, లత, అమన్‌, సాయి, శ్రీధర్‌, పరుశురాం తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 26 , 2026 | 12:32 AM