ఆటో కార్మికులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
ABN , Publish Date - Jan 07 , 2026 | 11:57 PM
అధికారంలోకి రా గానే ఆటో కార్మికులకు ఏడాదికి 12 వేల చొప్పున ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిం దని బీఆర్‌ఎస్ జిల్లా అద్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు.
గంభీరావుపేట, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): అధికారంలోకి రా గానే ఆటో కార్మికులకు ఏడాదికి 12 వేల చొప్పున ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిం దని బీఆర్‌ఎస్ జిల్లా అద్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు. మం డల కేంద్రంలో బుధవారం ఏర్పా టు చేసిన కేటీఆర్ ఆత్మీయ భరో సా కార్యక్రమానికి తోట ఆగయ్య విచ్చేసి మాట్లాడారు. రాష్ట్ర సాధన లో సబ్బండ వర్ణాలు కులాలకు అతీతంగా కొట్లాడాయని, ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆటో కార్మికు ల పాత్ర ఎంతో కీలకమైందన్నారు. ఆటోలు కట్టుకుని రోడ్డె క్కారని గుర్తుచేశారు. అందులో భాగంగానే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆటో కార్మికులకు టాక్సీ మాఫీ చేశా రన్నారు. రైతులకు అనుకోకుండా ఏదైనా సంభవిస్తే 5లక్షల భీమా పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. ప్రస్తుతం ఆటో కార్మికులు, వారి కుటుంబాలు ఇబ్బందుల పాలు కావద్దని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం చేపించాడన్నారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికి ఆటో కార్మికులకు 12 వేలు ఇస్తామన్న హామీ తుంగలో తొక్కిందన్నారు. అనంతరం ప్రమాద బీమా, చల్మెడ ఆరోగ్య హెల్త్‌కార్డులను ఆటో కార్మి కులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ గౌరవ జిల్లా అద్యక్షుడు రాంమోహన్, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, బీఆర్‌ఎస్ మండల అద్యక్షుడు పాపగారి వెంకటస్వామి, సెస్‌డైరెక్టర్ నారాయణరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు వెంకటి, మండల ప్రధానకార్యదర్శి రాజు, స్థానిక ఉపసర్పంచ్ కమలాకర్‌రెడ్డి, ఆటోయూనియన్ మం డల అద్యక్షుడు ఇబాదుల్లాఖాన్, నాయకులు లింగమ్‌యా దవ్, చేరాల వెంకటస్వామి, వహీద్, శివయ్య, మీనయ్య, శ్రీనివాస్, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్‌లో చేరిక
మండల కేంద్రంలో బుధవారం బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షు డు తోట ఆగయ్య సమక్షంలో 35 మంది బీఆర్‌ఎస్‌లో చేరా రు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పాపగారి వెంకటిస్వామి, సెస్ డైరెక్టర్ నారాయణరావు, పట్టణ అధ్యక్షుడు వెంకటి, మండల ప్రధానకార్యదర్శి రాజు, ఉపసర్పంచ్ కమలాకర్ రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.