Share News

హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం

ABN , Publish Date - Jan 06 , 2026 | 12:45 AM

హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలమైందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌ విమర్శించారు.

హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం
లబ్ధిదారులకు చెక్కులను అందజేస్తున్న కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌

-కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌

మెట్‌పల్లి రూరల్‌, జనవరి5 (ఆంధ్రజ్యోతి): హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలమైందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌ విమర్శించారు. కేసీఆర్‌ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలే ప్రజల జీవితాలలో వెలుగులు నింపాయని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌ అన్నారు. సోమవారం మెట్‌పల్లితో పాటు మండలంలోని గ్రామాల్లో కల్యాణలక్ష్మి, షాదిముబారక్‌ పథకాల కింద మంజూరైన 72, సీఎంఆర్‌ఎఫ్‌ కింద మంజూరైన 56 మంది లబ్ధిదారులకు చెక్కులను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చ కుండా ప్రతిక్ష పార్టీ బీఆర్‌ఎస్‌ నాయకులను బూతులు తిడుతూ కాలం వెల్లదీస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌ విమర్శించారు. కార్యక్ర మంలో రెవెన్యూ డీటీ ఖాదీర్‌, ఆర్‌ఐలు కాంతయ్య, ఉమేష్‌, ప్రజా ప్రతినిధులు, నాయ కులు, తదితరులు పాల్గొన్నారు.

ఫకోరుట్ల: పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం లభ్దిదారులకు సీఎం రిలీఫ్‌ పండ్‌ చెక్కులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ పంపిణీ చేశారు. మండలంతో పాటు కోరుట్ల పట్టణానికి చెందిన 37మంది లభ్దిదారులకు 12,46,000 విలువగల చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ నూతనంగా ఎంపికైన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లతో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ల పోరం మాజీ జిల్లా అధ్యక్షుడు దారిశెట్టి రాజేష్‌ నాయకులతో పాటు పలువురు పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2026 | 12:45 AM