హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్
ABN , Publish Date - Sep 07 , 2026 | 12:36 AM
తెలంగాణ ప్రజలకు అడ్డది డ్డంగా సాధ్యం కాని హామీలనిచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి అన్నారు.
సిరిసిల్ల టౌన్, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ ప్రజలకు అడ్డది డ్డంగా సాధ్యం కాని హామీలనిచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి అన్నారు. గత అసెంబీల ఎన్నికల సమయం లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు, 420 హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చి వేయి రోజులైన పూర్తి స్థాయిలో హామీలను అమలు చేయకపోవడం పట్ల బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వారం రోజుల నిరసన కార్యక్రమాలలో భాగంగా ఆదివారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 39 వార్డులలో కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పంపిణి చేస్తూ ఆయ ప్రధాన కూడల్లవద్ద బాకీ కార్డులతో నిరసనలు తెలిపారు. స్థానిక 3వ వార్డులో మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిం దం చక్రపాణి, 34వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ గడపగడప కు తిరుగుతూ బాకీ కార్డులను పంపిణి చేసి ప్రధాన కూడల్ల వద్ద బాకీ కార్డు లతో నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ కళాచక్రపాణి, వైస్ చైర్మన్ దార్ల సందీప్, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు చక్రపాణి మాట్లాడారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు, 420 హామీలను 100రోజులలో నెరవేరుస్తామని మోసపూరిత మాటలతో అన్ని వర్గా ల ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కి వచ్చి 1000రోజులైన ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలకు బాకీ పడిన హామీలను అమలు చేయా లని బాకీ కార్డులను గడప గడపకు పంపిణి చేసి ప్రధాన కూడల్ల వద్ద నిరస నలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ వార్డుల బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు, వార్డు అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.