Share News

మోసపూరిత మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌

ABN , Publish Date - Sep 09 , 2026 | 12:36 AM

ఎన్నికల సమయంలో మోసపూరిత మాటలను చెప్పి కాంగ్రెస్‌ పార్టీ గద్దెనెక్కిందని వేయి రోజు ల గడిచిన ఆరు గ్యారెంటీలు, 420హామీలను అమలు చేయలేదని బీఆర్‌ ఎస్‌ పార్టీ నిరసనలో భాగంగా మంగళవారం స్థానిక అంబేద్కర్‌ చౌరస్తా వద్ద నాయకులు నిరసనలు తెలిపారు.

మోసపూరిత మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌

సిరిసిల్ల టౌన్‌, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : ఎన్నికల సమయంలో మోసపూరిత మాటలను చెప్పి కాంగ్రెస్‌ పార్టీ గద్దెనెక్కిందని వేయి రోజు ల గడిచిన ఆరు గ్యారెంటీలు, 420హామీలను అమలు చేయలేదని బీఆర్‌ ఎస్‌ పార్టీ నిరసనలో భాగంగా మంగళవారం స్థానిక అంబేద్కర్‌ చౌరస్తా వద్ద నాయకులు నిరసనలు తెలిపారు. అనంతరం డాక్టర్‌ బీఆర్‌ అంబే ద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను శాసన సభ సమావేశాలకు హాజరుకాకుండా ప్రభుత్వం పోలీస్‌ యంత్రాంగంతో అడ్డుకోవడం ఎమ్యెల్యే, ఎమ్మెల్సీలపై దాడి చేయ డాన్ని నిరసిస్తూ అంబేద్కర్‌ చౌరస్తా వద్ద రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. సీఎం రేవం త్‌రెడ్డి ఫ్లెక్సీ దహనం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవ డంతో తోపులాటలు జరిగాయి. పోలీసులకు బీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం తెలంగాణ భవనంలో విలేకరుల సమావేశంలో నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు,బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నియోజకవర్గం ఇంచార్జి ఉమ మాట్లాడారు. అనంతరం కేసీఆర్‌ చనిపోవాలని వ్యాఖ్యానించిన షాద్‌నగర్‌ ఎమ్మెల్యే ఈర్లపెల్లి శంకర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ నాయ కులు ఎస్పీ మహేష్‌ బి గితేకి ఫిర్యాదు చేశారు. తంగళ్లపల్లి మండం కేంద్రంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గజబీంకర్‌ రాజన్న ఆధ్వర్యంలో నాయకులు ఎస్‌ఐకి ఫిర్యాదు చేశారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడూరి ప్రవీన్‌, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, ప్రధాన కార్యదర్శి మ్యాన రవి, ఉపాధ్యక్షుడు ఎండీ సత్తార్‌, పట్టణ మహి ళా అధ్యక్షురాలు బత్తుల వనజ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్ర పాణి, వైస్‌చైర్మన్‌ దార్ల సందీప్‌, సెస్‌చైర్మన్‌ చిక్కాల రామారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 09 , 2026 | 12:36 AM