Share News

విమోచన చరిత్రను విస్మరించిన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌

ABN , Publish Date - Sep 14 , 2026 | 12:20 AM

ఓటు బ్యాంకు రాజకీయాలతో విమోచన చరిత్రను కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు విస్మరించాయని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచ న దినోత్సవాన్ని నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి డిమాండ్‌ చేశారు.

విమోచన చరిత్రను విస్మరించిన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌

సిరిసిల్ల అర్బన్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : ఓటు బ్యాంకు రాజకీయాలతో విమోచన చరిత్రను కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు విస్మరించాయని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచ న దినోత్సవాన్ని నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి డిమాండ్‌ చేశారు. బీజేపీ రాష్ట్ర కమి టీ పిలుపు మేరకు ఈనెల 17నుంచి అక్టోబరు 17వరకు నిర్వహిం చే సేవా సంకల్ప అభియాన్‌ కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం సిరిసిల్ల పట్టణంలోని సర్దార్‌వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహానికి క్షీరాభి షేకం చేశారు. అనంతరం విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ 1947ఆగస్టు 15న దేశమంతా స్వాతంత్య్రం పొందినప్పటికీ, హైదరాబాద్‌ సం స్థానం మాత్రం నిజాం పాలనలో కొనసాగిందన్నారు. సర్దార్‌ వల్ల భాయ్‌ పటేల్‌ నాయకత్వంలో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌ పోలో ద్వారా హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనం అయిందన్నారు. 1948 సెప్టెంబర్‌ 13న ప్రారంభమైన ఆపరేషన్‌ పోలో అనంతరం నిజాం భారత సైన్యానికి లొంగిపోవడంతో సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని, ఈ చారిత్రక ఘట్టాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరచిపోరన్నారు. తెలంగాణ విమోచన చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలోనూ, ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా తెలంగా ణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు వెనుకడుగు వేస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం సాధించామని చెప్పుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్‌ సైతం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా, విలీన దినోత్సవంగా పరిమితం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అదే విధానా న్ని కొనసాగిస్తూ విమోచన చరిత్రను విస్మరిస్తోందన్నారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే విమోచన దినోత్సవా న్ని అధికారికంగా నిర్వహించి, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వంటి మహనీయుల త్యాగాలను భావితరాలకు చాటి చెబుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎర్రం మహేష్‌, లింగంపల్లి శంకర్‌, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పొన్నాల తిరుపతిరెడ్డి, సిరికొండ శ్రీనివాస్‌, జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు, బర్కం వెంకట లక్ష్మీ, జిల్లా కార్యవర్గ సభ్యులు గొపాడి సురేందర్‌ రావు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు, అంకిరెడ్డి పల్లె గ్రామ సర్పంచ్‌ రాగుల రాజిరెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్య క్షుడు ఉడుగుల యాదగిరి, మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌ సాబీర్‌, ధార్మిక సెల్‌ కన్వీనర్‌ డాక్టర్‌ సత్యనారాయణ, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు మ్యాన రాంప్రసాద్‌, పార్టీ నాయకులు కొండ నరేష్‌, ఊరగోండ రాజు, మెరుగు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 14 , 2026 | 12:21 AM