ఓటు అడిగే హక్కు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు లేదు..
ABN , Publish Date - Jan 22 , 2026 | 12:14 AM
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదని, బీజేపీకి మాత్రమే ఉందని భారతీ య జనాతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అ న్నారు.
సిరిసిల్ల టౌన్, జనవరి 21 (ఆంధ్రజ్యోతి) : రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదని, బీజేపీకి మాత్రమే ఉందని భారతీ య జనాతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అ న్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యా లయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నిధులతోనే మున్సి పాలిటీల మనుగడ సాగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అర్బన్ డెవలప్‌మెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కింద రూ. 15 కోట్లు నిధులను సిరిసిల్ల మున్సిపాలిటీకి ఇవ్వగా కాంగ్రెస్ ప్రభు త్వం అదనంగా రూ.3కోట్లు కలిపి మొత్తం తామే ఇస్తున్న ట్లు సిరిసిల్ల పట్టణం 2వ వార్డులో అభివృద్ధి పనుల్లో భాగంగా సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపనలు చేయడానికి మంత్రులు సిద్ధపడడం సిగ్గుచేటన్నారు. సొమ్ము ఒకరిది అయితే సోకు ఇంకొకరిది అన్న చందంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరో పించారు. మున్సిపాలిటీకి పట్టణ ప్రగతి కింద నెలకు రూ.30 లక్షలు నిధులు వస్తే వాటిని సిరిసిల్ల మున్సిపల్ సిబ్బంది మూడు నెలల నుంచి రూ.90 లక్షలు జీతాలకు వాడుకోవడం విడ్డూరంగా ఉందన్నా రు. తాగునీరు సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం అమృత్ 20స్కీం కింద సిరిసిల్ల మున్సిపాలిటీకి రూ.104కోట్లు నిధులను మం జూరు చేస్తే ఆ నిధులను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగిస్తే పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ముఖ్యమంత్రి బావమరిది సోదా కంపెనీకి టెండర్ వచ్చేలా చేసిందని ఆరోపించారు. అదేవిధంగా గత పది సంవత్సరాల కాలంగా ప్రతి సంవత్సరం 14, 15 ఫైనాన్స్ ద్వారా సిరిసిల్ల మున్సిపాలిటీకి వచ్చిన రూ.2కోట్లు నిధులు వచ్చాయన్నారు. నాడు పదిసంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పాలకవర్గం ఈ నిధులను దేనికి వెచ్చించిందో ప్రజలకు సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు. 10 సంవత్సరాల కాలంలో బీఆర్‌ఎస్, రెండున్నర సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమి లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిరిసిల్ల మున్సిపల్‌కు నిధు లను మంజూరు చేసిందని, రానున్న మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని అప్పుడు సిరిసిల్ల మున్సిపల్ మరింత అభి వృద్ధి జరుగుతుందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పాలనలో మున్సిపల్ లో జరిగిన అభివృద్ధి పనులు, జరగని పనులపై సీబీఐ, ఈడీ విచార ణను బీజేపీ పక్షాన కోరుతామని అన్నారు. సమావేశంలో బీజేపీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షుడు శీలం రాజు, ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతి రెడ్డి, సిరికొండ శ్రీనివాస్, కార్యదర్శి కర్నె హరీష, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మ్యాన రాంప్రసాద్ నాయకులు లింగంపల్లి శంకర్, ఎర్రం మహేష్, నాయకులు పాల్గొన్నారు.