Share News

కమనీయం.. లక్ష్మీనర్సింహస్వామి కల్యాణం..

ABN , Publish Date - May 23 , 2026 | 12:45 AM

ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామంలో శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.

కమనీయం.. లక్ష్మీనర్సింహస్వామి కల్యాణం..

ఎల్లారెడ్డిపేట, మే 22 (ఆంధ్రజ్యోతి): ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామంలో శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్స వాల్లో భాగంగా శుక్రవారం వేద పండితుడు వెంకటరమణాచార్యుల ఆధ్వర్యంలో హోమం, పూర్ణాహుతి, తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పందిరిలో స్వామివారి ఉత్సవమూర్తుల ను ప్రతిష్టించారు. వేదమంత్రోచ్ఛరణల నడుమ కల్యాణాన్ని కన్నుల పండువగా జరిపించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. సాయంత్రం స్వామి వారి శోభాయాత్రను గ్రామవీధుల గుండా నిర్వ హించారు. మహిళలు మంగళహారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ రవీందర్‌రావు, ప్యాక్స్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, సెస్‌ డైరెక్టర్‌ కృష్ణహరి, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2026 | 12:45 AM