జిల్లాల పునర్విభజన పేరుతో గందరగోళం
ABN , Publish Date - Jan 23 , 2026 | 12:47 AM
కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన పేరుతో గందరగోళం సృష్టిస్తోందని బీఆర్‌ఎస్ రాష్ట్ర వ ర్కింగ్ అధ్యక్షుడు కే తారకరామారావు మండిపడ్డారు.
సిరిసిల్ల, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన పేరుతో గందరగోళం సృష్టిస్తోందని బీఆర్‌ఎస్ రాష్ట్ర వ ర్కింగ్ అధ్యక్షుడు కే తారకరామారావు మండిపడ్డారు. గురువారం రాజ న్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ తెలంగాణ భవన్‌లో సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలపై వార్డు ఇన్‌చార్జిలతో నిర్వహించిన సమావేశంలో దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాను ఎత్తివేయాలనే కుట్రలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉ న్నారని, ఈ విషయంలో సిరిసిల్ల ప్రజలు, న్యాయవాదులు, మేధావుల్లో ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. జిల్లాలను ఎత్తివేయడానికి సిద్ధ మైన ప్రభుత్వం సెస్‌ను కూడా ఎత్తివేయడంలో ఆశ్చర్యం లేదని విమ ర్శించారు. రేవంత్ రెడ్డి పాలనను తుగ్లక్ తరహా నిర్ణయాల పాలనగా ఉందని అభివర్ణించారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ షాక్‌లో ఉందని, అందుకే కార్పొరేషన్ ఎన్నికలు పెట్టడానికి భయపడుతోందని అన్నారు. రాష్ట్రంలో 40 శాతం పైగా సర్పంచ్ స్థానాలను బీఆర్‌ఎస్ కైవ సం చేసుకుందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేళ్ల మీద లెక్కపెట్టే స్థానాలను కూడా గెలవలేదన్నారు. సిరిసిల్ల పట్టణం గత 35 ఏళ్లుగా కాంగ్రెస్‌కు దూరంగా ఉందని, బీఆర్‌ఎస్ ఆవిర్భావం తర్వాత మున్సిపాలిటీపై పూర్తి ఆధిపత్యం సాధించామని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌పార్టీలు సింగిల్ డిజిట్ కూడా దాటలేని పరిస్థితిలో ఉన్నాయన్నారు. బీఆర్‌ఎస్ చేసింది ప్రతి ఇంటికి చెప్పాలని, కాంగ్రెస్ బాకీ కార్డు ప్రతి గడపకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలయ్యాయో, వృద్ధులు, మహిళలు, రైతు లు, నేతన్నలు, రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం ఎంత బాకీ పెట్టిందో ప్రజలకు వివరించాలని సూచించారు. సంక్రాంతి దాటినా రైతు బంధు రాలేదని, బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వలేదని, రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్లు కూడా దిక్కు లేని పరిస్థితి ఉందని విమర్శించారు. నేతన్నలకు నిజమైన అం డగా నిలిచింది కేవలం బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలను నేరుగా తానే పర్య వేక్షిస్తానని ప్రకటించారు. ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్‌ఎస్ వైపే ఉన్నారనే ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్ ఫీవర్ పట్టు కుందని, సిరిసిల్ల ప్రజలంతా గులాబీ జెండా వైపే ఉన్నారని స్పష్టం చేశారు.సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త, ప్రతి వార్డు ఇన్‌చార్జి ఇంటింటి ప్రచారం చేస్తూ ప్రజల మధ్య కు వెళ్లాలని, అభివృద్ధిని వివరించి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో గులాబీ జెండానే ఎగరబోతుందని, మెజారిటీ వార్డులను గెలవడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ పార్టీ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. సిరిసిల్ల ఒకప్పుడు ఎలా ఉందో, బీఆర్‌ఎస్ పాలనలో ఎలా అభివృద్ధి చెందిందో ప్రజలకు స్పష్టంగా వివరించాలన్నారు. చేసిన పని మనమే చెప్పుకోవాలి వేరే ఎవరు చెప్పరన్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత స్థానిక ఎన్నికలు ఉండవని, నేరుగా సాధారణ ఎన్నికలే ఉంటాయన్నా రు. సిరిసిల్ల మున్సిపాలిటీ గెలవడమే కాదు అన్ని వార్డులను బీఆర్‌ఎస్ కైవసం చేసుకోవాల్సిందేనని అన్నారు.ఈ సమావేశంలో టెస్కాబ్ మాజీ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు, బీఆర్‌ఎస్ జిల్లా ఆధ్యక్షుడు తోట ఆగ య్య, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు తదితరులు పాల్గొన్నారు.