Share News

కరువుపై సమగ్ర శాస్త్రీయ సర్వేలు చేపట్టాలి

ABN , Publish Date - Oct 28 , 2026 | 11:41 PM

జిల్లాలోని అన్ని మండ లాల్లో కరువుపై సమగ్ర శాస్త్రీయ సర్వేలు చేపట్టి, అర్హత ఉన్న మండలాల ను కరువు ప్రభావిత జాబితాలో చేర్చాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు.

కరువుపై సమగ్ర శాస్త్రీయ సర్వేలు చేపట్టాలి

సిరిసిల్ల అర్బన్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని అన్ని మండ లాల్లో కరువుపై సమగ్ర శాస్త్రీయ సర్వేలు చేపట్టి, అర్హత ఉన్న మండలాల ను కరువు ప్రభావిత జాబితాలో చేర్చాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు. కలెక్టరేట్‌లో బుధవారం కలెక్టర్‌ గరి మ అగ్రవాల్‌ను కలిసి కరువు మండలాల్లో శాస్త్రీయ సర్వేలు చేపట్టి కరువు మండలాలుగా గుర్తించి జాబితాల్లో చేర్చాలంటూ వినతిపత్రాన్ని అందించా రు. ఈ సందర్బంగా గోపి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటిం చిన కరువు ప్రభావిత మండలాల జాబితాలో జిల్లాలోని కేవలం రెండు మండలాలను మాత్రమే ప్రకటించడం సరికాదన్నారు. జిల్లాలోని పలు మండలాల్లో కరువు పరిస్ధితులు నెలకొన్నాయని, వర్షాభావం, సాగునీటి కొరత, భూగర్భ జలమట్టాలు తగ్గిపోవడం వంటి సమస్యలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని మండలాల వాస్తవ పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి, అర్హత కలిగిన మండలాలకు న్యాయం చేయాలని కోరారు. సకాలంలో తగిన వర్షాలు కుర వకపోవడం, సాగునీటి వనరుల్లో నీటి లభ్యత తగ్గడం, విద్యుత్‌ సరఫరా సమస్యలు వంటి కారణాలతో వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. పంటల దిగుబడులు దెబ్బతినడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పలు ప్రాంతాల్లో సాగు, తాగునీటి కొరత సమస్యగా మారుతోందన్నారు. కరువు ప్రభావిత మండలాలను గుర్తించే సమయంలో కేవలం సాధారణ వర్షపాతం గణాంకాల ఆధారంగానే నిర్ణ యాలు తీసుకోకుండా ప్రతి మండలంలోని వాస్తవ పరిస్థితులను శాస్త్రీ యంగా అంచనా వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు లింగంపల్లి శంకర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా కోశాధికారి అసాని రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 28 , 2026 | 11:41 PM