Share News

ప్రభుత్వ విద్యాలయాల్లో సకల సౌకర్యాలు

ABN , Publish Date - Nov 06 , 2026 | 12:44 AM

ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రజా ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తుందని ప్రభుత్వ విప్‌, వేముల వాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ తెలిపారు.

ప్రభుత్వ విద్యాలయాల్లో సకల సౌకర్యాలు

కోనరావుపేట, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రజా ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తుందని ప్రభుత్వ విప్‌, వేముల వాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ తెలిపారు. కోనరా వుపేట మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రూ.56లక్షలతో నూత న వసతి గృహం, టాయిలెట్స్‌, రూ. 9 లక్షల 50 వేలతో భవిత కేంద్ర నిర్మాణానికి, రూ.30లక్షల తో ఐకేపీ గోడౌన్‌ నిర్మాణానికి ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌తో కలిసి భూమి పూజ చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం విద్యాభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నూతన తరగతి, వసతిగదులు, మౌ లిక వసతుల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నదని వివరించారు. అన్ని విద్యాలయాల్లో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తు న్నామని వెల్లడించారు. విద్యార్థులకు కాస్మోటిక్‌, డైట్‌ చార్జీలు పెంచిందని తెలిపారు. యంగ్‌ ఇం డియా ఇంటర్నేషనల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని, తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లను నిర్మించనున్నదని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసిందని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రణా ళిక ప్రకారం చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. కేజీబీవీ, భవిత సెంటర్‌, ఐకేపీ గోడౌన్‌ నిర్మాణ పనులను త్వరగా మొదలుపెట్టి గడువు లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. ఆయా పనులు ప్రణాళిక ప్రకారం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. మండల కేంద్రంలో రూ.30లక్షల తో ఐకేపీ గోడౌన్‌ నిర్మాణానికి ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే, కలెక్టర్‌తో కలిసి శంకు స్థాపన చేశారు. పనులు శరవేగంగా పూర్తి చే యాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కచ్చకాయల ఎల్లయ్య, ప్యాక్స్‌ చైర్మన్లు చేపూరి గంగాధర్‌, బొమ్మేన భాస్కర్‌రావు, ఆరీవో కేఎస్‌బీ కుమారి, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, కోనరావుపేట సర్పంచ్‌ కాశీరాం, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు బోయిని దేవరాజు, తహసీల్దార్‌ వరలక్ష్మి,ఎంపీడీవో స్నిగ్ధ, జీసీడీవో పద్మజ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2026 | 12:44 AM