Share News

ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర అభివృద్ధి

ABN , Publish Date - Aug 16 , 2026 | 01:49 AM

రాష్ట్రంలో ప్రజల భాగస్వామ్యంతో అన్ని రంగాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజహరుద్దీన్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర అభివృద్ధి

-జిల్లాలో 10,860 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

-మహిళా సంఘాలకు రూ.213.98 కోట్ల వడ్డీలేని రుణాలు

-స్వాతంత్య్ర దినోత్సవంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజహరుద్దీన్‌

జగిత్యాల, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రజల భాగస్వామ్యంతో అన్ని రంగాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజహరుద్దీన్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి అజహరుద్దీన్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ’తెలంగాణ రైజింగ్‌ -2047 విజన్‌తో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. సంక్షేమ పథకాలతో ప్రజలకు ఆర్థిక భరోసా అందుతోందన్నారు. జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు నూతన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలో 48,868 నూతన రేషన్‌ కార్డులు మంజూరు చేసి 37,837 మంది కుటుంబ సభ్యుల పేర్లను కొత్తగా నమోదు చేశామని చెప్పారు. వృద్ధులు, వితంతువులు తదితర కేటగిరీలకు చెందిన 2,18,002 మంది లబ్ధిదారులకు ప్రతీ నెల రూ.47 కోట్ల పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు కొత్తగా చేయూత పింఛన్ల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభిస్తోందన్నారు. గ్యాస్‌ సిలిండర్లకు రూ.44.79 కోట్ల సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం భరించిందన్నారు. 200 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించే 2,44,408 సర్వీసులకు రూ. 200.26 కోట్లు ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు.

ఫమహిళా సాధికారతకు పెద్దపీట..

జిల్లాలో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ఇప్పటి వరకు రూ. 213.98 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామని మంత్రి అజహరుద్దీన్‌ తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.21.25 కోట్ల వడ్డీ మాఫీ నిధులు అందించామని చెప్పారు. స్త్రీనిధి సంస్థ ద్వారా మహిళలకు రూ.18.20 కోట్ల రుణాలు అందించామని తెలిపారు. ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేసేందుకు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద దరఖాస్తు చేసుకున్న 10,860 మందికి ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. ఇందు కోసం రూ. 230.94 కోట్లు చెల్లించామని తెలిపారు. మహిళలను కోటీశ్వర్లును చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అజహరుద్దీన్‌ అన్నారు. పలు మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల జంబో చెక్కులను పంపిణీ చేశారు. డీఆర్‌డీఓ పరిధిలో పనిచేస్తున్న 675 స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.75 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు, స్త్రీనిధి ద్వారా 1,053 మహిళా సంఘాలకు మంజూరు అయిన రూ. 18.20 కోట్ల జంబో చెక్కును, మెప్మా పరిధిలో పనిచేస్తున్న 32 స్వయం సహాయక సంఘాల 186 మంది మహిళలకు బ్యాంకు లింకేజీ కింద మంజూరు అయిన రూ. 13.93 కోట్ల విలువ గల జంబో చెక్కును పంపిణీ చేశారు. జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు 3,53,166 నూతన స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు.

ఫరైతు సంక్షేమానికి కృషి

రైతు సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించారు. యాసంగిలో 444 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 5,44,861 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు 1,01,464 మంది రైతుల ఖాతాల్లోకి రూ. 1,299 కోట్ల విలువ గల డబ్బులు జమ చేశామన్నారు. రికార్డు స్థాయిలో వరి ధాన్యం కొనుగోళ్లు చేశామని తెలిపారు. రైతు బీమా ద్వారా ఇప్పటి వరకు మరణించిన 5,424 మంది రైతు కుటుంబాలకు రూ. 271 కోట్ల ఆర్థిక చేయూత అందించామని తెలిపారు. ఎల్‌నినో పరిస్థితులను తట్టుకునేలా తక్కువ నీటితో ఎక్కువ పంటలు సాగు చేసే విధంగా సూక్ష్మ నీటిపారుదల పథకం ద్వారా పలువురు రైతులకు పరికరాలకు అనుమతి ఇచ్చామని తెలిపారు.

ఫవిద్యారంగానికి అధిక ప్రాధాన్యం

జిల్లాలో విద్యా రంగానికి అధిక ప్రాధన్యతనిస్తున్నామని మంత్రి అజహరుద్దీన్‌ అన్నారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ పైమ్రరీ నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో కూడిన బ్రేక్‌ఫాస్ట్‌ పథకాన్ని రాష్ట్రంలో త్వరలో ప్రారంభిస్తు న్నామని తెలిపారు. జగిత్యాల జిల్లాలో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ కోసం గొల్లపల్లి మండలం చిల్వకోడూర్‌, జగిత్యాల రూరల్‌ మండలం అంతర్గాం, మల్లాపూర్‌ మండలం సాతారం పాఠశాలలు ఎంపికయ్యాయన్నారు. విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి బోధన అందించేందుకు జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల ఏర్పాటుకు ప్రతి నియోజకవర్గానికి రూ.200 కోట్ల చొప్పున మంజూరు చేశామని తెలిపారు. విద్యార్థులకు కాస్మెటిక్‌ ఛార్జీలు, డైట్‌ ఛార్జీలు పెంచడంతో పాటు కామన్‌ డైట్‌ మెనూ అమలు చేస్తున్నామని చెప్పారు.

ఫమైనార్టీల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు...

జిల్లాలో మైనార్టీల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అజహరుద్దీన్‌ అన్నారు. మహిళలకు 598 కుట్టుమిషన్లు, 150 మంది యువతకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ అందించామని తెలిపారు. రేవంత్‌ అన్న సహారా కింద 15 మంది లబ్ధిదారులకు రూ.15 లక్షలు, ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన ద్వారా 76 మంది లబ్ధిదారులకు రూ.36 లక్షలు మంజూరు చేశామని చెప్పారు.

ఫవైద్య రంగంలో మెరుగైన సేవలు...

జిల్లాలో వైద్య రంగంలో మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలో 102 ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాలు, 6 బస్తీ దవాఖానాలు, 17 పీహెచ్‌సీలు, 5 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 3 సీహెచ్‌సీలు, మాతా శిశు కేంద్రం, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ఏప్రిల్‌-జూలై 2026 వరకు జిల్లాలో జరిగిన 3,046 ప్రసవాల్లో 2,149 ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగాయని చెప్పారు. 8 మహిళా క్లినిక్‌లలో 8,447 మంది మహిళలకు పరీక్షలు నిర్వహించామని, టీ డయాగ్నస్టిక్స్‌ ద్వారా 93,564 మంది నుంచి నమూనాలు సేకరించి ఉచిత పరీక్షలుూ నిర్వహించామని తెలిపా

ఫమౌలిక వసతుల కల్పనకు చర్యలు

జిల్లాలో రహదారులు, భవనాల శాఖ ద్వారా జిల్లాలో రూ.1,084 కోట్లతో 292 పనులు మంజూరు కాగా, అందులో 222 పనులు పూర్తయ్యాయి తెలిపారు. 69 పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. భూ భారతి చట్టం అమలులో భాగంగా జిల్లాలో నక్షాలు లేని 20 గ్రామాలను ఎంపిక చేసి సర్వే పనులను వేగవంతంగా చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలోని 71 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందిస్తున్నామని చెప్పారు.

ఫఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

వివిధ ప్రభుత్వ శాఖలు తమ శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించేలా శకటాల ప్రదర్శన నిర్వహించాయి. డీఆర్‌డీఏ, హౌసింగ్‌, ఉద్యానవన శాఖ, జిల్లా సంక్షేమ శాఖ , జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, మత్స్యశాఖ, పోలీస్‌ శాఖ, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోలీస్‌ డాగ్‌ స్క్వాడ్‌ ఇచ్చిన ప్రదర్శన విశేషంగా ఆకట్టుకున్నాయి. నార్కోటిక్‌ డ్రగ్స్‌, దొంగతనాలు, హత్యల సందర్బంగా పోలీస్‌ డాగ్‌ స్క్వాడ్‌ అందించే సేవలను కళ్లకు కట్టే విదంగా ప్రదర్శనలు ఇచ్చారు. పలు దేశ భక్తి, సినీ, జానపద గేయాలపై చిన్నారులు ఇచ్చిన ప్రదర్శనలు అలంరించాయి. ప్రదర్శనలిచ్చిన విద్యార్థులకు మంత్రి అజహరుద్దీన్‌ ప్రశంసా పత్రాలు, బహుమతులు అందించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ బి.సత్య ప్రసాద్‌, ఎస్పీ అశోక్‌ కుమార్‌, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ దినేష్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సమిళ్ల వాణి శ్రీనివాస్‌, అదనపు కలెక్టర్లు బీఎస్‌ లత, రాజాగౌడ్‌, డీఆర్‌ఓ ప్రసాద్‌, ఆర్‌డీవోలు, జిల్లా అధికారులు, పోలీస్‌ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2026 | 01:49 AM