బాధ్యతాయుతంగా జనగణన పూర్తి
ABN , Publish Date - Apr 21 , 2026 | 11:44 PM
జనగణన-2027 సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్లు బాధ్యతాయుతంగా పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
సిరిసిల్ల, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి) : జనగణన-2027 సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్లు బాధ్యతాయుతంగా పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జన గణనలో భాగంగా హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ సెన్సస్ మానిటరింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిజిటల్ విధానం, స్వీయ గణన(సెల్ఫ్ ఎన్యూమరేషన్)పై సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్లకు రాజ న్న సిరిసిల్ల జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆఖరిరోజు శిక్షణ కొనసాగు తుండగా, మంగళవారం కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. జన గణనకు సంబంధించిన కిట్లను సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్లకు పంపి ణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. మొదటి దశలో మే 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు ఇళ్ల గణన నిర్వహిస్తారని, రెండో దశ ఫిబ్రవరి 2027లో వ్యక్తుల వారీగా సమాచా రం సేకరిస్తారని అధికారులు తెలిపారు. ప్రతి కుటుంబం వివరాలు పక్కాగా సేకరించి, నమోదు చేయాలని ఆదేశించారు. అందరి వివరా లు గోప్యంగా ఉంచాలని స్పష్టం చేశారు. ఎండాకాలం నేపథ్యంలో ఓ ఆర్‌ఎస్ ప్యాకెట్లు, నీటి బాటిల్ వెంట తీసుకువెళ్లాలని సూచించారు. ఈనెల 26వ తేదీన స్వీయ గణన చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా చేసుకోవాలని ఆదేశించారు. శిక్షణను సద్వినియో గం చేసుకోవాలని బాధ్యతల నిర్వహణలో ఎంతో కీలకమని స్పష్టం చేశారు. వివరాలు పక్కాగా సేకరించి నమోదు చేయాలని ఆదేశిం చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసాచారి, ఛార్జ్ అధికారులు మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, మహేష్ కుమా ర్ తదితరులు పాల్గొన్నారు.