Share News

సాధ్యమైనంత త్వరగా కొనుగోళ్లు పూర్తి..

ABN , Publish Date - May 28 , 2026 | 12:48 AM

తుది దశకు చేరుకున్న ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు.

సాధ్యమైనంత త్వరగా కొనుగోళ్లు పూర్తి..

గంభీరావుపేట, మే 27 (ఆంధ్రజ్యోతి) : తుది దశకు చేరుకున్న ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. మండలంలో ని సముద్రలింగాపూర్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొను గోలు కేంద్రాన్ని కలెక్టర్‌ తనిఖీచేశారు. ఇప్పటి వరకు ఈ కేంద్రంలో ఎంత ధాన్యం సేకరించారూ.. ఎంత వరకు ట్యూబ్‌ ఎంట్రీ పూర్తి చేశారు.. అనే వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. తూకం వేసిన బస్తా లను జాప్యం చేయకుండా కొనుగోలు కేంద్రాల నుంచి తరలించాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. సన్న రకాల సాగుపై దృష్టి సారించాలని రైతులను కోరారు. సర్పంచ్‌ గంగ సాయవ్వ, మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ కొమిరిశెట్టి విజయ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి లక్ష్మీనారాయణ, జిల్లా పౌర సరపరాల అధికారి బుచ్చిబాబు, వ్యవసాయ అధికారి అఫ్జల్‌బేగం, తహసీల్దార్‌ మారుతిరెడ్డి, ఎంపీడీవో రాజేందర్‌ ఉన్నారు.

Updated Date - May 28 , 2026 | 12:48 AM