భవన నిర్మాణాలను త్వరగా పూర్తిచేయండి
ABN , Publish Date - May 30 , 2026 | 12:01 AM
ఉపాధి హామీ పనుల్లో భాగం గా చేపట్టిన భవనాల నిర్మాణాలను జూన 30లోగా పూర్తి చేయా లని పంచాయతీరాజ్ రాష్ట్ర అడిషనల్ కమిషనర్ రవీందర్ సంబం ధిత అధికారులను ఆదేశించారు.
పంచాయతీరాజ్‌శాఖ రాష్ట్ర అడిషనల్ కమిషనర్ రవీందర్
కొడిమ్యాల, మే 29(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పనుల్లో భాగం గా చేపట్టిన భవనాల నిర్మాణాలను జూన 30లోగా పూర్తి చేయా లని పంచాయతీరాజ్ రాష్ట్ర అడిషనల్ కమిషనర్ రవీందర్ సంబం ధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని పూడూ ర్ గ్రామంలో 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన మురికి నీటి కాల్వను పరిశీలించారు. అనంతరం మండలంలోని నాచుపల్లి గ్రామంలోని ఉన్నత పాఠశాలలో 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన అదనపు తరగతి గదిని ఆయన పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ అంగనవాడీ కేంద్రాల భవనాలు, వీవోల భవనాలు, గ్రామపంచాయతీ భవనాల పనులను, పాఠశాలలో మరుగుదొడ్ల, మూత్రశాలల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. జడ్పీ సీఈవో గౌతంరెడ్డ్డి, డీఆర్డీవో రఘువరన, డీపీవో మదనమోహన, ఎంపీడీవో ఇ స్వరూప, పీఆర్ ఏఈఈ చంద్రశేఖర్, ఎంపీవో భగవానరెడ్డి, కార్యదర్శులు ఉన్నారు.