Share News

ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

ABN , Publish Date - Mar 23 , 2026 | 11:45 PM

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యా దులను జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు.

ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

సిరిసిల్ల అర్బన్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యా దులను జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కి జిల్లా నలుమూల నుంచి ప్రజలు తరలివచ్చి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌, అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌లతో పాటు జిల్లా అధికారులను ఫిర్యాదులను అందించారు. ప్రజావాణిలో 167 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో రెవెన్యూ కు 62, గృహ నిర్మాణ శాఖకు 28, డీఆర్‌డీవోకు 19, జిల్లా పంచాయతీకి 9, ఉపాధికల్పన శాఖకు 5, స్పెషల్‌ డిప్యూటి కలెక్టర్‌కు 5, ఎస్పీ కార్యాలయా నికి 5, సర్వేఅండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌కు 4, జిల్లా విద్యాధికారికి 3, జిల్లా వైద్యా ధికారికి3, జిల్లా సంక్షేమాధికారికి 3, నీటి పారుదల శాఖకు 3, సెస్‌ఎండికి 3, జిల్లా పౌరసరఫరాల శాఖకు 2, మైనింగ్‌ శాఖకు 2, వేములవాడ రాజేశ్వ రస్వామి దేవాలయానికి 2, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌కు 2, మత్స్యుశాఖ అధికా రికి 1, ఎస్సీ సంక్షేమ శాఖకు 1, ఈడీఎంకు 1, అర్‌అండ్‌బీ ఈఈకి 1, మిష న్‌ భగీరథకు 1, సిరిసిల్ల మున్సిపాల్టీకి 1, సబ్‌రిజిస్ట్రర్‌కు 1 చొప్పున ఫిర్యాదు లు రావడంతో వీటి సంబంధిత జిల్లా అధికారులకు అందించి సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ ప్రజావాణిలో ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులను ఎన్ని పరిష్కరించా రనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను ఆన్‌ లైన్‌లో పరిష్కరించాలని పెండింగ్‌లో పెట్టవద్దని ఆదేశించారు. అన్నిశాఖల అధికారులు బాధ్యులు తప్పనిసరిగా ప్రజావాణికి హాజరుకావాలని స్పష్టం చేశారు. ఈ ప్రజావాణిలో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, వేములవాడ ఆర్డీవో రాధాబాయి తదితరులు పాల్గొన్నారు.

ఇటుక బట్టీలపై చర్యలు తీసుకోవాలి..

ముస్తాబాద్‌ మండలం పోత్గల్‌ గ్రామశివారులో ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటుచేసిన ఇటుక బట్టీలపై కలెక్టర్‌ విచారణ జరిపించి చర్య లు తీసుకోవడంతోపాలు మానేరు కాలువలను పూడ్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ ఎన్‌ఆర్‌ఐ జిల్లా అధ్యక్షుడు తోట ధర్మేందర్‌ సోమవారం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాన్ని అందించారు. గ్రామంలోని బీరప్ప, ఎల్లమ్మ గుళ్లదగ్గర ఉన్న వ్యవసాయ పంట భూముల్లో గ్రామానికి చెందిన గోదా గౌరయ్య, దారంసోత్‌ బాపురావులు అనే వ్యక్తులు ఇటుక బట్టీలను ఏర్పాటుచేసి ఒరిస్సాకు చెందిన కూలీలతో చాకరి చేయిస్తూ ఇటు కలను చేయిస్తున్నాడని పేర్కొన్నారు. అంతేకాకుండా ఎగువ మానేరు డ్యాం నుంచి నిర్మించిన కాలువలను పూర్తి పూడ్చివేసి ట్రాక్టర్‌లు, లారీలు పోయేం దుకు రోడ్డును నిర్మించడం జరిగిందని దీనిపైవిచారణ జరిపి కార్మికులను అదుకోవడంతోపాటు యాజమానులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎస్టిమేషన్‌ పత్రాలను అందించాలి

మిడ్‌మానేర్‌ డ్యాంలో ముంపునకు గురైన చీర్లవంచ గ్రామంలో తమకు ఉన్న రేకుల షెడ్‌లకు ఎస్టిమేషన్‌ పత్రాలను అందించడంతోపాటు వాటికి నష్టపరిహారం అందించాలంటూ నిర్వాసితులు సోమవారం కలెక్టరేట్‌కు తర లివచ్చి కలెక్టర్‌ను కలిసి వినతి పత్రాలను అందించారు. గ్రామానికి చెందిన వనపర్తి తిరుపతి, శంకరవ్వలతోపాటు మరికొంత మంది నిర్వాసితులు తమ భూమితోపాటు రేకుల షెడ్‌లకు నష్టపరిహారం రావాలంటే ఎస్టిమే షన్‌ పత్రాలను ఇప్పించి న్యాయం చేయాలని వేడుకున్నారు.

ప్రభుత్వ మిగులు భూమిని జీపీకి అప్పగించాలి

కోనరావుపేట మండలం(కొలనూరు) గొల్లపల్లి గ్రామంలో సర్వేనంబర్‌ 514లోని ప్రభుత్వ భూమిని గ్రామపంచాయతీకి అప్పగించాలంటూ పాలక వర్గ సభ్యులు సోమవారం కలెక్టరేట్‌కు తరలివచ్చి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ కు వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ భూమిని గ్రామానికి చెందిన సూర బుచ్చయ్య, బోదాసు నర్సయ్య, సూర పాపయ్య, సూర భీమయ్యలు ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేసి సాగు చేసుకుంటున్నా డని ఆ భూమిని గ్రామపంచాయితీకి అప్పగించితే అందులో అంగన్‌వాడీ, మహిళ సంఘ భవనాలను నిర్మించుకుంటామని సర్పంచ్‌ బోజ్జం మల్లేశం, వార్డు సభ్యులు కోరారు.

పోత్గల్‌లో సర్పంచ్‌ భర్త పెత్తనం..

సర్పంచ్‌ భర్త పెత్తనంతోపాటు చేసే పనులను భరించలేకపోతున్నామ ని, దీనిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలంటూ గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు సోమవారం కలెక్టరేట్‌కు తరలివచ్చి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌కు వినతిపత్రాన్ని అందించారు. ముస్తాబాద్‌ మండలం పోత్గల్‌ గ్రామపంచాయతీ సర్పంచ్‌ పెద్దగారి యాదమ్మ భర్త శ్రీనివాస్‌ సర్పంచ్‌లా వ్యవహరిస్తున్నాడని తెలిపారు. ఈనెల 11వ తేదీన గ్రామపంచాయతీ పాల కవర్గ సభ్యులమైన తాము గ్రామపంచాయతీలోని సమావేశ మందిరంలో కూర్చోవడానికి వెళ్లగా తాళం వేసి ఉందని, తీయాలని కోరగా దురుసుగా మాట్లాడాడని తెలిపారు. దీనిపై విచారణ జరిపించాలంటూ ఉపసర్పంచ్‌ కోల కృష్ణ, వార్డుసభ్యులు ఎరవెల్లి సుకన్య, కెంగర్ల జ్యోష్న, కారంగులు వెంక ట్‌రావు, జంగ లక్ష్మీనారాయణ, జిల్లెల్ల రేణుక, వంగపెల్లి కనుకయ్య, జంగ రాజు, జోల్లె భవాని, కీసర లాస్య, గీస అనిత, అది శేఖర్‌, చేపూరి శ్రీనివాస్‌ గౌడ్‌, బండ రమేష్‌లు కోరారు.

సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లులకు డబ్బులు అడుగుతున్నారు..

ముస్తాబాద్‌ మండల కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రిలో ఇటీవల లాప్రో స్కోపిక్‌ శస్త్రచికిత్స చేయించుకున్నానని, బిల్లులు ఇస్తే సీఎంఆర్‌ఎఫ్‌కు దరాఖాస్తు చేసుకుంటానని రశీదులు, బిల్లులు ఇవ్వాలని అడిగితే సిబ్బంది లంచం అడుగుతున్నాని పెద్దబోనాలకు చెందిన పంగ బాలమణి వాపో యింది. దీనిపై విచారణ జరిపించాలని వేడుకుంది.

Updated Date - Mar 23 , 2026 | 11:45 PM