Share News

సృజనాత్మకత వెలికి తీసేందుకే పోటీలు

ABN , Publish Date - Apr 21 , 2026 | 11:50 PM

విద్యార్ధుల్లో దాగి ఉన్న సృజనాత్మక వెలికితీతకే ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పోటీలు నిర్వహించినట్లు కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ తెలిపారు.

సృజనాత్మకత వెలికి తీసేందుకే పోటీలు

తంగళ్లపల్లి, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): విద్యార్ధుల్లో దాగి ఉన్న సృజనాత్మక వెలికితీతకే ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పోటీలు నిర్వహించినట్లు కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణా ళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా తంగళ్లపల్లి మం డలం బద్దనపల్లి టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ పీఎంశ్రీ గురుకు ల పాఠశాలలో విద్యార్ధులకు క్విజ్‌, డిబేట్‌, చిత్రలేఖనం తదితర పోటీలు మంగళవారం నిర్వహించారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అథితిగా హాజరయ్యారు. ముందుగా విద్యార్థుల పాటలు, నృత్యాలు, ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతు లను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా కలె క్టర్‌ మాట్లడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మార్చి 6వ తేదీన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్ర మాన్ని ప్రారంభించారని తెలిపారు. జూన్‌ 12వ తేది వరకు 10 శాఖల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం రూప కల్పన చేసిందని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన పనులను వివరిస్తూ భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు కార్యక్రమం అమలు చేస్తోం దని వెల్లడించారు. ఈనెల 20వ తేదీ నుంచి 26వ తేది వరకు సంక్షేమ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడిం చారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో పారిశుధ్య పనులు, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరుగురు ప్రత్యేక వైద్య నిపుణులతో వైద్య పరీక్షలు రెసిడెన్షియల్‌ విద్యాలయాల్లో విద్యార్థులకు నిర్వహించా మని తెలిపారు. రోడ్లు భద్రత నియమా లు, ట్రాఫిక్‌ నిబంధనలు అమలు, గ్రామ రోడ్‌ సేప్టీ కమిటీలు ఏర్పాటు చేశామని, డ్రైవర్లకు కంటి వైద్య పరీక్షలు, ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించామన్నారు. సంక్షేమ వారోత్సవాల సందర్భంగా జిల్లా లోని అన్ని రెసిడెన్షియల్‌ విద్యాలయాల్లో కిచెన్‌, స్కూల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌ నిర్వహిం చామని పేర్కొన్నారు. టాలెంట్‌ హంట్‌లో భాగంగా విద్యార్థులకు పోటీలు నిర్వహిం చామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్‌రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, జిల్లా పంచాయతీ అధికారి షరీఫోద్దీన్‌, గురకులాల డీసీవో ధెరిస్సా, తహసీల్దార్‌ విజయప్రకాశ్‌రావు, ఎంపీడీవో లక్ష్మీ నారాయణ, సర్పంచ్‌ సిలివేరి లావణ్య చిరంజీవి, ప్రిన్సి పాల్‌ పద్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 21 , 2026 | 11:50 PM