Share News

రంగుల సంబురం

ABN , Publish Date - Mar 04 , 2026 | 12:57 AM

అవని రంగుల మయమైంది. హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. చిన్నాపెద్ద తేడాలేకుండా రంగులు పూసుకుంటూ సంబరాల్లో మునిగి తేలారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆడి పాడారు.

రంగుల సంబురం
క్యాంప్‌ కార్యాలయంలో అధికారులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్న ఎస్పీ అశోక్‌కుమార్‌

- జిల్లా వ్యాప్తంగా అంబరాన్నింటిన హోలీ వేడుకలు

- సంబరాల్లో మునిగితేలిన ప్రజాప్రతినిధులు, అధికారులు

అవని రంగుల మయమైంది. హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. చిన్నాపెద్ద తేడాలేకుండా రంగులు పూసుకుంటూ సంబరాల్లో మునిగి తేలారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆడి పాడారు. ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జిల్లా కేంద్రంలో మున్సిపల్‌ చైర్‌పర్సన సమీండ్ల వాణి శ్రీనివాస్‌, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన అడువాల జ్యోతి లక్ష్మణ్‌, మాజీ మంత్రి జీవనరెడ్డి నివాసంలో సంబరాల్లో పాల్గొన్నారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌ కుటుంబసభ్యులు, అధికారులతో కలిసి హోలీ ఆడారు.

జగిత్యాల టౌన, మార్చి 3(ఆంధ్రజ్యోతి): జగిత్యాల పట్టణంలో మంగళవారం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ అశోక్‌కుమార్‌ అధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సంద ర్భంగా జిల్లా ప్రజలకు హోలీ పండగా శుభకాంక్షలు తెలియచేసిన ఎస్పీ అశోక్‌కుమార్‌ కుటుంబ సభ్యుల తో కలిసి అధికారులతో హోలీ ఆడారు. మున్సిపల్‌ చైర్‌పర్సన సమీండ్ల వాణి శ్రీనివాస్‌ హోలీ సం బురాలలో పాల్గొని పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన అడువాల జ్యోతి లక్ష్మణ్‌ స్థానిక కౌన్సిలర్లతో కలిసి రంగులు చల్లుకున్నారు. జడ్పీ మాజీ చైర్‌పర్సన దావ వసంత సురేష్‌లు ధరూర్‌ క్యాంపు రామాలయ ప్రాంగణంలో, మాజీ మంత్రి జీవనరెడ్డి నివాసంలో, వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పద్మ నాయక కల్యాణ మండపంలో వేడుకలు ఘనంగా నిర్వహిం చారు. తెలంగాణ స్టేట్‌ టీచర్స్‌ ఆసోషియేషన, ధరూర్‌ క్యాంపు వాకర్స్‌ ఆసోషియేషన ఆధ్వర్యం లో, టీయూడబ్ల్యూజే (ఐజే యూ) ఆధ్వర్యంలో జర్నలిస్టులు వేడుకలు నిర్వహిం చారు. పట్టణంలో అవాంఛనీయ సంఘట నలు జరు గకుండా పట్టణ ఇనస్పెక్టర్‌ పి. కరుణాకర్‌ ఆధ్వర్యం లో పటిష్ట బందోబస్తు నిర్వహించారు.

రాయికల్‌: రాయికల్‌ మండల కేంద్రంలో మున్సి పల్‌ చైర్మన కట్కం రవీందర్‌, ఎంఈవో శ్రీపతి రాఘ వులు, పలువురు అధికారులు, జర్నలిస్టులు, కాలనీ వాసులు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. మండలం లోని భూపతిపూర్‌లో చిన్నారులు టెక్నాలజీని వాడు కున్నారు. క్యూ ఆర్‌ కోడ్‌ అరువుగా తీసుకుని దానిని పట్టుకుని ఇంటింటా తిరుగుతూ కాముడు కూలే అని పాటలు పాడుతూ.. హోలీ పండుగ జరుపుకున్నారు.

జగిత్యాలరూరల్‌: మండలంలోని కన్నాపూర్‌లో సర్పంచ సతీష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ సంబరాల్లో మాజీమంత్రి జీవనరెడ్డి పాల్గొన్నారు.

మల్యాల/పెగడపల్లి/గొల్లపల్లి/మల్లాపూర్‌/ ఇబ్రహీంపట్నం/కథలాపూర్‌: మల్యాల, పెగడపల్లి, గొల్లపల్లి, మల్లాపూర్‌, కథలాపూర్‌ మండలాల్లో చిన్నా రులు, యువతీయువకులు, మహిళలు రంగులు పూ సుకుంటూ సంబరాలు చేసుకున్నారు. రంగులు, కోడిగుడ్లతో హోలీ జరుపుకున్నారు.

వెల్గటూర్‌: మండలంలో జరిగిన వేడుకల్లో మండ ల ఉపసర్పంచల ఫోరం అధ్యక్షుడు గండ్ర ప్రతాప్‌ రావు, మెరుగు మురళి, బందెల ఉదయ్‌, సందీప్‌రెడ్డి, సంతోష్‌, మహేష్‌, సురేష్‌, యూత సభ్యులు పాల్గొ న్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్సై ఉదయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పెట్రోలింగ్‌ నిర్వహించారు.

ధర్మపురి: ధర్మపురిలో జరిగిన వేడుకల్లో మున్సి పల్‌ చైర్‌పర్సన వేముల నాగలక్ష్మి, కమిషనర్‌ మామి ళ్ల శ్రీనివాస్‌రావు, వైస్‌చైర్మన ఇందారపు రామయ్య, కౌన్సిలర్లు చీపిరిశెట్టి రాజేష్‌, చుక్క సంధ్య-భీమరాజు పాల్గొన్నారు. సీఐ రాంనర్సింహరెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ మహేష్‌, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

కోరుట్ల/కోరుట్ల రూరల్‌: కోరుట్ల పట్టణం, మండలంలో నిర్వహించిన వేడుకల్లో వివిధ యువ జన సంఘాలు, కుల సంఘాలు, మహిళ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

మెట్‌పల్లి రూరల్‌: హోలీ పండుగ అందరి జీవితా ల్లో సుఖసంతోషాలతో వెలుగులు నింపాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌ అన్నారు. మం గళవారం హోలీ పండగ సందర్భంగా గ్రామాల్లో పండగ వేడుకలు ఘనంగా జరుపుకు న్నారు.

మెట్‌పల్లి టౌన: పట్టణంలో హోలీ వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. 1992-93 బ్యాచ పదో తరగతి పూర్వ విద్యార్థులు హోలీ సంబ రాలు నిర్వహించుకున్నారు. పట్టణంలోని జువ్వాడి భవనలో హోలీ పండుగను యువజన కాంగ్రెస్‌ నాయకులు, పలువురు యువకులు, కౌన్సిలర్లు కలిసి సందడి చేస్తూ రంగులు పూసుకొని ఆనందంగా గడి పారు. పట్టణంలోని 14వ వార్డు కౌన్సిలర్‌ ధోనికెలా శిరీష నవీన కాలనీల్లోని యువతీ, యువకులతో కలిసి హోలీ వేడుకలు నిర్వహించుకున్నారు.

Updated Date - Mar 04 , 2026 | 12:57 AM