Share News

సీఎం సభ.. నేతన్నల సమస్యల పరిష్కార వేదిక

ABN , Publish Date - Sep 25 , 2026 | 12:16 AM

సిరి సిల్లలో జరిగే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభను జిల్లాలోని కార్మికులు, నేతన్నలు, పేదలు, రైతు లు, యువత తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వేదికగా ఉపయోగించుకోవాలని ఆది శ్రీనివాస్‌ కోరారు.

సీఎం సభ.. నేతన్నల సమస్యల పరిష్కార వేదిక

సిరిసిల్ల, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : సిరి సిల్లలో జరిగే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభను జిల్లాలోని కార్మికులు, నేతన్నలు, పేదలు, రైతు లు, యువత తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వేదికగా ఉపయోగించుకోవాలని ఆది శ్రీనివాస్‌ కోరారు. గురువారం జిల్లా కేం ద్రంలో పవర్‌లూమ్‌ ఆసాములు, యజమాను లు, కార్మికులతో సిరిసిల్లలో ఈ నెల 30న జరిగే సీఎం సభ నేపథ్యంలో సమావేశాలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లా డుతూ సిరిసిల్ల అభివృద్ధి కోసం సీఎం సభను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగ స్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. బహిరంగ సభను కార్మికులు, నేతన్నలు, రైతులు, యువత పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల న్నారు. ఈనెల30న సాయంత్రం 4 గంటలకు అంబేద్కర్‌ విగ్రహం వద్దకు ప్రతి ఒక్కరూ చేరుకోవాలని, అక్కడినుంచి ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డితో కలిసి సభా ప్రాంగణం వరకు చేరుకో వాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి హెలికా ప్టర్‌ ద్వారా కాలేజ్‌ గ్రౌండ్‌కు చేరుకున్న అనంత రం కార్మికులు, రైతులు, యువత మధ్య నుంచి సుమారు మూడు కిలోమీటర్ల మేర పాదయాత్ర గా సభా ప్రాంగణానికి వెళ్లనున్నారని తెలిపారు. కార్మిక సంఘాల నాయకులు తమ సమస్యలను లిఖితపూర్వకంగా అందించాలని, ముఖ్యమంత్రి సభకు వెళ్లే సమయంలోనే వినతిపత్రాలను సమర్పించేలా కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు. సిరిసిల్లలోని నేత కార్మికులు, టెక్స్‌టైల్‌ రంగం కార్మికులు, మున్సిపల్‌ కార్మికులు, ఆసుప త్రి సిబ్బంది తదితర రంగా ల్లో పనిచేస్తున్న వారి సమస్యలను ప్రభుత్వం దృ ష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇ చ్చారు. 2023తర్వాత రావా ల్సిన యార్ప్‌ సబ్సిడీ, టెక్స్‌ టైల్‌ పార్కులోని సమస్య లు, కార్మికులకు వేతనాలు సకాలంలో అందకపోవడం వంటి అంశాలపై యాజ మాన్యాలతో సమావేశం నిర్వహించి పరిష్కార మార్గాలు అన్వేషిస్తామని తెలిపారు. ఈ సమావేశాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నాగుల సత్యనారాయణగౌడ్‌, కాం గ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, సిరి సిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, జౌళి శాఖ ఏడీ సంతోష్‌, టౌన్‌ క్లబ్‌ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు దేవరాజు, ఎస్సీసెల్‌ ప్రతినిధి ఆకునూరు బాలరా జు, పద్మశాలి సంఘం కన్వీనర్‌ లక్ష్మీనారాయణ, మున్సిపల్‌ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 25 , 2026 | 12:16 AM