సీఎంఆర్‌ఎఫ్ చెక్కులతో నిరుపేదలకు భరోసా
ABN , Publish Date - Apr 11 , 2026 | 12:29 AM
నిరుపేదలకు సీఎం సహాయ నిధి చెక్కులు ఎంతో భరోసాను కల్పిస్తున్నాయని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): నిరుపేదలకు సీఎం సహాయ నిధి చెక్కులు ఎంతో భరోసాను కల్పిస్తున్నాయని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రూరల్ మండలానికి చెందిన 54మంది బాధి తులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల అభ్యున్నతికి కృషి చేస్తుందని అన్నారు. కార్పోరేట్ ఆసుపత్రిలో వైద్యం తీసుకునే పేద వారికి సైతం తిరిగి డబ్బులు అందించి వారికి చేయూతనివ్వలనే ఉద్దేశం తో సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేస్తున్నామని అన్నారు. వేము లవాడ రూరల్ మండలంలో 54మంది దరఖాస్తు చేసుకున్న బాధితులకు రూ.17లక్షల 85వేల విలువగల చెక్కులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్ వట్టెంల సర్పంచ్ రంగు వెంకటేశ్ తదితరులు ఉన్నారు.