Share News

గడువులోపు సీఎంఆర్‌ లక్ష్యాన్ని సాధించాలి

ABN , Publish Date - Feb 04 , 2026 | 12:38 AM

గుడువులోపు సీఎంఆర్‌ లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ రైస్‌ మిల్లర్ల ను ఆదేశించారు.

గడువులోపు సీఎంఆర్‌ లక్ష్యాన్ని సాధించాలి

సిరిసిల్ల అర్బన్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి) : గుడువులోపు సీఎంఆర్‌ లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ రైస్‌ మిల్లర్ల ను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం సీఎం ఆర్‌ బియ్యం డెలీవరీపై రైస్‌మిల్లర్లు, యాజమానులతో సమీక్షా సమావేశా న్ని నిర్వహించారు. 2024-25 ఖరీఫ్‌, రబీ సీజన్‌లకు సంబంధించిన మిల్లుల వారీగా కేటాయించిన ధాన్యం డెలివరీ చేయకుండా పెండింగ్‌లో ఉన్న ధాన్యం వివరాలపై సుదీర్ఘంగా చర్చించారు. రైస్‌మిల్లుల వారీగా నిర్ధేశించిన లక్ష్యానికి అనుగుణంగా గుడువులోగా పూర్తి చేసేలా నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికారులను ఇన్‌చార్జి కలెక్టర్‌ అదేశించారు. మిల్లర్లు నిబంధ నల ప్రకారం సీఎంఆర్‌ బియ్యాన్ని సమయానికి డెలివరీ చేయాలని సూ చించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఖరీఫ్‌ 2024- 25 సీజన్‌కు సంబంధించి ధాన్యం ప్రభుత్వానికి అప్పగించడానికి ఈనెల 16వ తేదీవరకు అందించాలని, అలాగే రబీకి సంబంధించిన ధాన్యం ఈ నెల 28వ తేదీలోగా అందించాలన్నారు. జిల్లాకు కేటాయించిన సీఎంఆర్‌ లక్ష్యాన్ని పూర్తి చేయడం మిల్లుర్లు బాధ్యతగా భావించాలని సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వచ్చే సీజన్‌లో లక్ష్యాన్ని సమర్థవం తంగా చేరుకునేలా ముందు చూపుతో వ్యవహరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి పౌరసరఫరాల శాఖ అధికారి రాధాబాయి, మేనేజర్‌ రజిత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 04 , 2026 | 12:38 AM