Share News

గడువులోగా సీఎంఆర్‌ తప్పనిసరిగా ఇవ్వాలి

ABN , Publish Date - Sep 09 , 2026 | 12:30 AM

జిల్లాలోని రా, బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్లు సీఎంఆర్‌ గడువులోగా తప్పనిసరిగా ఇవ్వాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ స్పష్టం చేశారు.

గడువులోగా సీఎంఆర్‌ తప్పనిసరిగా ఇవ్వాలి

సిరిసిల్ల, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రా, బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్లు సీఎంఆర్‌ గడువులోగా తప్పనిసరిగా ఇవ్వాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ స్పష్టం చేశారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదా యంలో అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, ఎఫ్‌సీఐ, పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. యాసంగి, ఖరీఫ్‌ 2024-25 సీజన్‌ సీఎంఆర్‌పై జిల్లాలోని రా, బాయిల్డ్‌ రైస్‌మిల్లుల వారీగా ఎంత సీఎంఆర్‌ ఇవ్వాలి, ఇప్పటివరకు ఎంత ఇచ్చారనే అంశాలపై ఆరా తీశారు. కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ మాట్లా డుతూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలోని రైస్‌ మిల్లర్లు తప్పని సరిగా సీఎంఆర్‌ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ మేరకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేసుకోవాలని, లక్ష్యం మేరకు ఇవ్వాలని తెలిపారు. సమావేశం లో ఎఫ్‌సీఐ డీఎంలు, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 09 , 2026 | 12:30 AM