Share News

నెలాఖరులో సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ

ABN , Publish Date - Sep 14 , 2026 | 12:28 AM

సిరిసిల్లలో ఈనెలాఖరులో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగ సభ ఉంటుం దని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జీ కేకే మహేందర్‌రెడ్డి వెల్లడించారు.

నెలాఖరులో సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ

గంభీరావుపేట, సెప్టెంబరు 13 (ఆంధ్ర జ్యోతి) : సిరిసిల్లలో ఈనెలాఖరులో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగ సభ ఉంటుం దని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జీ కేకే మహేందర్‌రెడ్డి వెల్లడించారు. గంభీరావు పేట మండలం దమ్మన్నపేటలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ నేతలు దళిత స్పీకర్‌ను అవమానపర్చడమే కాకుండా పశుపు నీళ్లుపోసి, శుద్ధి చేసి యావ త్తు దళితుల ఆత్మగౌరవాన్ని కించపర్చారన్నా రు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో నియంతృత్వ, నిరంకుశ పోకడలతో అవినీతి అక్రమాలకు పాల్పడి రాష్ట్రాన్ని దోచుకున్న చరిత్ర బీఆర్‌ఎస్‌ పార్టీదేనని ఆరోపించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభు త్వం పాలించిన తొమ్మిదిన్నరేళ్ళలో రాష్ట్రం 8 లక్షల 40వేల కోట్ల అప్పుల ఉబిలో కూరుకుపో యిందన్నారు. అటువంటి క్లిష్ట పరిస్థితిలో అధి కారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యే యంగా ప్రజా పాలన కొనసాగిస్తూ ఒకవైపు అప్పుల కుప్పకు నెలకు 6750 కోట్ల మిత్తి కట్టుకుంటూ మరో వైపు ప్రజా సంక్షేమ కార్య క్రమాన్ని అమలు చేస్తోందన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో మొదటి విడతలో 3500 ఇళ్లను మంజూరు చేశామని, మరో 2000 ఇళ్లను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల రేషన్‌ కార్డులను ఇచ్చిందన్నారు. కోటి మంది మహి ళలను కోటీశ్వరు లను చేయాలనే ఆలోచనతో, ప్రతి రంగంలో మహిళలు ముం దుండాలనే సం కల్పంతో అధిక అవకాశాలు కల్పిస్తూ, పావల వడ్డీ ఇస్తూ, వడ్డిలేని రుణా లను 10 లక్షలు పెంచిన ఘనత కాంగ్రెస్‌దే అన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో తీసుకె ళుతూ కాంగ్రెస్‌ ప్రజాపాలన కొనసాగుతుం దన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ నాయ కులు పర్శ హన్మండ్లు, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు హమీద్‌, నాయకులు రాజనర్సింహా రెడ్డి, ఎలుక రాజు, భాస్కర్‌, విఠల్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 14 , 2026 | 12:28 AM