సిరిసిల్లపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Sep 27 , 2026 | 12:07 AM
సిరిసిల్లపై ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని చేనేత జౌళి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
సిరిసిల్ల, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): సిరిసిల్లపై ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని చేనేత జౌళి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈనెల 30న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొననున్న భారీ బహిరంగ సభ నేపథ్యంలో శనివారం జిల్లా కేంద్రంలో మణికంఠ గార్డెన్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశానికి అతిథులుగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరా వు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి రాష్ట్ర ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీని వాస్, విజయరమణారావు, వక్ఫ్‌బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మ తుల్లా, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జీ కేకే మహేందర్‌రెడ్డి లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగే శ్వరరావు మాట్లాడుతూ సిరిసిల్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, సీఎం సిరిసిల్లను సభా వేదికగా ఎంచుకోవడాన్ని కార్యకర్తలు అర్థం చేసుకోవాలని అన్నారు. ఈ సభ రాష్ట్ర, దేశ రాజకీయాల్లో చర్చనీయాంశం గా మారేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి సభను సమష్టిగా విజయవంతం చేయాలని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ కార్యకర్తలపై నమోదైన కక్షపూరిత కేసుల అంశాన్ని పరిశీలిస్తామని తెలి పారు. కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కాపాడటం, వారి సంక్షేమా నికి అండగా నిలవడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం మిగిల్చిన బకాయిలను చెల్లిస్తూ, రైతులు, నేతన్నల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నా రు. సిరిసిల్ల చేనేత రంగానికి యారన్ డిపో ఏర్పాటు చేయ డంతోపాటు నేతన్నలకు సంబంధించిన రుణభారాన్ని తగ్గిం చే చర్యలు చేపట్టామని తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కూడా ఆది శ్రీనివాస్ కోరుకున్న మేరకు ముందుకు సాగుతోందన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమ లులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోంద న్నారు. దేశ రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నా యని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దక్షిణ భారతదేశంపై రాజకీయంగా విస్తరించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శిం చారు. ఆర్థిక సమస్యలు, కేంద్రం నుంచి ఎదురవుతున్న ఇబ్బందుల మధ్య కూడా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనే త రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలన్నది సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్ష అన్నారు. ముఖ్యమంత్రి సభను విజయ వంతం చేయడానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్లను సభా వేదికగా ఎంచుకోవడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసు కుని సభను విజయవంతం చేయాలని కోరారు.
గత ప్రభుత్వంలో అడ్డగోలుగా కేసులు..
గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై అడ్డగోలుగా కేసులు పెట్టిందని, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కూడా అనేక కేసులు నమోదు చేసిందని రాష్ట్ర ఐటీ పరిశ్ర మల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలోని సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గాల్లో సుమారు రూ వేయ్యి కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. భవిష్యత్ లో సిరిసిల్ల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీగా కాం గ్రెస్ అభ్యర్థులు గెలిచేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొనే భారీ బహిరంగ సభను కాంగ్రెస్ శ్రేణులంతా సమ ష్టిగా కృషి చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సభకు జనసమీకరణ విషయంలో ప్రతి ఒక్కరూ ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలని సూచించారు.కేటీఆర్ గతంలో అనేక హామీలు ఇచ్చి పలువురిని బీఆర్‌ఎస్‌లోకి తీసుకెళ్లా రని, అక్కడ ఆశించిన ఫలితాలు లేక తిరిగి వచ్చిన వారు ఉన్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు రుణమాఫీ, పంటలకు మద్దతు ధర, కొత్త రేషన్‌కార్డులు, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు,సన్నబియ్యం వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలి పారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి విషయంలో గతంలో కేసీఆర్ పలుమార్లు వచ్చి హామీలు ఇచ్చారని, అయితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒకసారి వచ్చి ఆలయ అభివృద్ధికి చర్యలు చేపట్టారన్నారు. ముంపు గ్రామాల ప్రజ లకు కూడా ఇందిరమ్మ ఇళ్లను అందిస్తున్నామని, ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తికాకముందే ప్రతిపక్షాలు అసత్య ప్ర చారాలు చేస్తున్నాయని విమర్శించారు. దానం నాగేందర్ అంశంపై కేటీఆర్ మాట్లాడటాన్ని ప్రస్తావిస్తూ.. ఆ విషయం పై మాట్లాడే నైతిక హక్కు లేదని వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న అనేక సంక్షేమ పథకాలు కేటీ ఆర్, హరీశ్‌రావు, కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన నియోజక వర్గాల్లోని ప్రజలకు కూడా అందుతున్నాయని తెలిపారు. సెప్టెంబర్ 30న సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహే ష్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో జరిగే సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చా రు. సభకు పెద్దఎత్తున ప్రజలను తరలించేలా గ్రామస్థాయి నుంచి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలను సభకు తరలించాలని సూచించారు.
ప్రజాపాలన విజయాన్ని చాటుదాం
చలో సిరిసిల్ల కార్యక్రమం ద్వారా ప్రజాపాలన విజయా న్ని చాటుదామని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఉత్తర తెలంగాణ జిల్లాల కు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ఆహ్వానం పలికారు. చలో సిరిసిల్ల పేరుతో నిర్వహించే కార్యక్రమానికి కాం గ్రెస్ పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో తర లివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 30వ తేదీన కరీంనగర్ జిల్లాలో నూతనంగా నిర్మించిన కలెక్ట రేట్ భవనాన్ని ప్రారంభించడంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, భారీ బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. 33నెలల ప్రజాపాలనలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సభ ద్వారా ప్రజలకు వివరించనున్నారని తెలిపారు. సామాజిక న్యాయం, ప్రజాస్వామిక ఆకాంక్షలు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కూడా ముఖ్య మంత్రి ప్రసంగిస్తారని పేర్కొన్నారు.ప్రజాపాలన ప్రభు త్వం సంక్షేమ రంగంతో పాటు వ్యవసాయం, సాంకేతిక రంగం, మౌలిక వసతులు, సాగునీరు, విద్య, ఉపాధి తదితర అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి దిశగా చర్యలు చేపడుతోందని తెలిపారు. సమీకృత అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. సిరి సిల్ల నేత కార్మికుల సమస్యల పరిష్కారంపై సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక శ్రద్ధ తీసు కుంటున్నారని తెలిపారు. నేత కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలోనూ నేత కార్మికుల సమస్యల పరిష్కారానికి అండగా నిలిచా మని, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం అధి కారంలో ఉన్నందున నేతన్నల సంక్షేమానికి మరింతగా కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ధార్మిక, కార్మిక, విద్యా రంగాలతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత వెయ్యి రోజుల్లో సుమారు రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయ ని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో జిల్లాలో అభివృద్ధి ఎక్కడా ఆగలేదని తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గానికి రూ.200 కోట్ల అంచనా వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరైందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటుచేస్తోందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌లు వేము లవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై గతంలో ఏటా రూ100కోట్ల చొప్పున రూ 400 కోట్లతో ఆలయాన్ని అభి వృద్ధి చేస్తామని హామీలు ఇచ్చి అమలు చేయలేదని విమర్శించారు. శివుడితో ఆటలు ఆడారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.250కోట్ల వరకు నిధులు విడుదల చేసిం దని తెలిపారు. ఇప్పటికే ఆలయ అభివృద్ధికి రూ249.40 కోట్ల నిధులు విడుదలైనట్లు వెల్లడించారు. గత ప్రభు త్వ హయాంలో నేత కార్మికులకు బకాయిలు మిగిలాయ ని, ప్రస్తుత ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతోందన్నారు. నేతన్నల కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిధులు కేటాయిం చడంతోపాటు వస్త్ర ఉత్పత్తికి ఆర్డర్లు కల్పిస్తోందని పేర్కొ న్నారు. సిరిసిల్లకు ఎక్కడి నుంచి వచ్చి ఏం చేశారో కేటీ ఆర్ చెప్పాలని ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటు కోసం ప్రజలు ఉద్యమం చేసిన సమయంలో జిల్లా ఏర్పాటు సాధ్యం కాదంటూ కేటీఆర్ బహిరంగ లేఖ ఇచ్చారని ఆరోపించారు. ప్రజల పోరాట ఫలితంగా నే రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడిందన్నారు. అసత్య ప్రచా రాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరు గుతున్నాయని విమర్శించారు. ఈనెల 30న ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్లలో నిర్వహించనున్న బహిరంగ సభకు భారీగా జనసమీకరణ చేస్తున్నామని, సుమారు వెయ్యి బస్సులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సభ నేపథ్యంలో గులాబీ గుండెల్లో గుబులు మొదలైంది అని వ్యాఖ్యానించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజ ల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ విజయరామణారావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, సిరిసిల్ల పట్టణ అధ్య క్షుడు సూర్య దేవరాజు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చంద్ర కళ, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ స్వరూపరెడ్డి, సురేంద ర్‌రెడ్డి, చక్రధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.