Share News

సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌లకు జ్ఞానోదయం కావాలి

ABN , Publish Date - Aug 22 , 2026 | 11:41 PM

అన్నారం, సుందిళ్ల పంప్‌హౌస్‌లను వినియోగించు కోవడంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్త మ్‌కుమార్‌ రెడ్డికి జ్ఞానోదయం కావాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీ జీవన్‌ రెడ్డి అన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌లకు జ్ఞానోదయం కావాలి

సిరిసిల్ల టౌన్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి) : అన్నారం, సుందిళ్ల పంప్‌హౌస్‌లను వినియోగించు కోవడంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్త మ్‌కుమార్‌ రెడ్డికి జ్ఞానోదయం కావాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీ జీవన్‌ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని తెలం గాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పాలనలో 24గంటలు అం తరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేసి పంటల ను కాపాడగా ఇప్పుడు కరెంట్‌ కనుమరుగైందని, కరెంట్‌ ఎప్పుడొస్తదో తెలియదని విమర్శించారు. ప్రాజెక్టుల నుంచి కాలువల ద్వారా నీరందించే అవ కాశం ఉన్నప్పటికి ప్రభుత్వం అందించడం లేదన్నా రు. కేసీఆర్‌ రీడిజైన్‌తో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే మేడి గడ్డ బ్యారేజీలో ఏడో బ్లాక్‌లో రెండు పీయర్స్‌ పగుళ్లు రావడం దురదృష్టకరమన్నారు. దాన్ని మరమ్మతు చేసు కొని వినియోగంలోకి తీసుకురావడం కోసం ఆలోచన చేయకుండా నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీని ప్రభుత్వం సాకుగా చూపుతోందని ఆరోపించారు. వృథాగా పోతున్న నది జలాలను కన్నెపల్లి పంప్‌ హౌస్‌ నుంచి మేడిగడ్డకు సంబంధం లేకుండా అన్నారంనకు ఎత్తిపోసి అక్కడినుం చి సుందిళ్లకు ఎత్తిపోస్తే అక్కడినుంచి ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోయవచ్చన్నారు. ఇన్ని రకాలుగా రెడీమేడ్‌ అవకా శాలున్నా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కు మార్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో మళ్లీ వినియోగంలోకి తీసుకొస్తే కేసీఆర్‌కు ఎక్కడ పేరు వస్తుందోనని భయప డుతున్నారన్నారు. కేంద్ర జల విద్యుత్‌ పరిశోధన సంస్థ మేడిగడ్డలోని ఏడవ బ్లాక్‌లోని నాలుగు పీయర్స్‌ కొంత నాణ్యత ప్రశ్నార్థకంగా ఉందని చెప్పిందన్నారు. కన్నెపల్లి పంప్‌హుజ్‌ వద్ద 93.5 మీటర్ల లెవల్లో ప్రవాహం ఉంటే దాన్ని ఎగువకు ఎత్తిపోసుకునే అవకాశం ఉందన్నారు. కన్నెపల్లి పంప్‌హుజ్‌ దిగువన దాదా పు రూ.100కోట్లతో కాఫర్‌ డ్యాం నిర్మాణం చేసుకో వాలని ఇంజనీర్లు చెబుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం భేషజాలకు పోవద్దన్నారు. ప్రభుత్వం ఎన్‌డీఎస్‌ఏను సాకుగా చూపుతూ రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోందని మండిపడ్డారు. ఇప్పటి కైనా ప్రభుత్వం కన్నెపల్లి నుంచి ఎగువకు నీరు ఎత్తిపోయాలన్నారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడూరి ప్రవీన్‌, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, ప్రధాన కార్యదర్శి మ్యాన రవి, ఉపాధ్యక్షుడు ఎండీ సత్తా ర్‌, తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు గజబీంకర్‌ రాజన్న, మాజీ జడ్పి చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, నాయకులు కృష్టారెడ్డి, దేవదాస్‌, రాఘవరెడ్డి, శంకర్‌, శ్రీనివాస్‌, మ హేందర్‌, మధూకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2026 | 11:41 PM