Share News

అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న సీఎం

ABN , Publish Date - Sep 11 , 2026 | 01:02 AM

అధికారాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దుర్వినియోగం చేస్తున్నాడని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు.

అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న సీఎం

సిరిసిల్ల టౌన్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : అధికారాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దుర్వినియోగం చేస్తున్నాడని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని తెలంగణ భవన్‌లో విలేకరుల సమావేశంలో ఆగ య్య మాట్లాడారు. ప్రజా సమస్యలను ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్‌ ఎమ్మె ల్యేలను, ఎమ్యెల్సీలను శాసన సభ నుంచి సస్పెండ్‌ చేయడాన్ని ఖండిస్తున్నా మన్నారు. సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. న్యాయ స్థానా లు జోక్యం చేసుకొని సస్పెన్షన్‌ను ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో దౌర్జన్యాలు, అరాచకాలు చేస్తూ అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీ ఆర్‌, మాజీ మంత్రి కేటీఆర్‌పై దుర్భాషలాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌, కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై కాంగ్రెస్‌ నాయకులు నోరు జారిన, ఇష్టం వచ్చినట్లు దూషించినా బీఆర్‌ఎస్‌ శ్రేణులు సహించబోవని హెచ్చ రించారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ దార్ల సందీప్‌, బీఆర్‌ఎస్‌ పట్టణ ప్రధాన కార్యదర్శి మ్యాన రవి, కౌన్సిలర్లు బూర బాలమల్లు, మొగిలి నాగరాజు, బీఆర్‌ఎస్‌ నాయకులు బొల్లి రామ్మోహన్‌, అనిల్‌కుమార్‌, కుంబాల మల్లారెడ్డి, కందుకూరి రామాగౌడ్‌, సాయికుమార్‌, అనిల్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 11 , 2026 | 01:02 AM