ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛత కార్యక్రమాలు
ABN , Publish Date - May 01 , 2026 | 12:54 AM
మున్సిపల్ అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో ప్రజలకు పారిశుధ్యంపై అవగాహన కల్పిస్తూ ప్రజల భాగస్వా మ్యంతో స్వచ్ఛత కార్యక్రమాలతో ముందుకు నడవాలని సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళాచక్రపాణి అన్నారు.
సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి) : మున్సిపల్ అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో ప్రజలకు పారిశుధ్యంపై అవగాహన కల్పిస్తూ ప్రజల భాగస్వా మ్యంతో స్వచ్ఛత కార్యక్రమాలతో ముందుకు నడవాలని సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళాచక్రపాణి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని రిసోర్స్ పార్క్‌లో వివిధ మున్సిపల్ కార్యాలయాలకు చెందిన కమిషనర్లు, శానిటరీ ఇన్ స్పెక్టర్లకు వేస్ట్ టూ కంపోస్ట్ విండ్రోఅండ్‌వర్మి కంపోస్టింగ్‌పై అవగాహన కార్యక్ర మాన్ని నిర్వహించగా మున్సిపల్ చైర్‌పర్సన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ కళాచక్రపాణి మాట్లాడుతూ పట్టణాలను స్వచ్ఛ పట్టణా లుగా తీర్చిదిద్దడంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకమన్నారు. పారిశుధ్య నిర్వహణ అనేది ఒకరోజు ఒక నెలతోనో అయి పోదని నిరంతరం ఒక ప్రక్రియ అని అన్నారు. కంపోస్ట్ డెవలప్‌మెంట్ అధికారి హేమలత మాట్లాడుతూ తడి వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతుల్లో వేరు చేసి విండ్రో, వర్మి కంపోస్టింగ్ విధానాల ద్వారా నాణ్యమైన సేంద్రియ ఎరువుగా మార్చవ చ్చని పేర్కొన్నారు. అనంతరం డోర్ టూ డోర్ తడి చెత్త సేకరణ, కంపోస్ట్ తయారీ వరకు అనుసరించాల్సిన పద్ధతులను సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఎండీ ఖాదీర్‌పాషా, వివిధ మున్సిపల్ కమిషనర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, జవాన్లు, సిబ్బంది, పారిశుధ్య కార్మి కులు పాల్గొన్నారు.