కేంద్ర, రాష్ట్ర నిధులతోనే నగర అభివృద్ధి
ABN , Publish Date - Oct 08 , 2026 | 12:07 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తేనే కరీంనగర్ అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు.
కరీంనగర్ టౌన్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తేనే కరీంనగర్ అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నగరంలోని 21వ డివిజన్‌లో మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ పాలనలో మంత్రిగా తాను సీఎం హామీ నిధులు తీసుకువచ్చి రోడ్లను అభివృద్ధి చేశానన్నారు. ఇంకా చేయాల్సిన రోడ్లు ఉన్నందున కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ నగర అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, కార్పొరేటర్ వరాల నర్సింగం, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ పాల్గొన్నారు.