కరుణామయుని సేవలో క్రైస్తవులు
ABN , Publish Date - Apr 04 , 2026 | 12:19 AM
గుడ్‌ఫ్రైడే సందర్భంగా శుక్రవారం చర్చ్‌లలో క్రైస్తవులు ప్రార్థనలు జరిపారు. ఏసుక్రీస్తు చెప్పిన ఏడు వాక్యాలను గుర్తుకు తెచ్చుకుని ఆధ్యాత్మిక భావంతో పులకరించి పోయారు.
కరీంనగర్ కల్చరల్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి) : గుడ్‌ఫ్రైడే సందర్భంగా శుక్రవారం చర్చ్‌లలో క్రైస్తవులు ప్రార్థనలు జరిపారు. ఏసుక్రీస్తు చెప్పిన ఏడు వాక్యాలను గుర్తుకు తెచ్చుకుని ఆధ్యాత్మిక భావంతో పులకరించి పోయారు. బైబిల్ పఠనాలు, ప్రార్థనలతో పాటు క్వాయర్స్ బృందం గీతాలు ఆలపించి జీసస్ పట్ల భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. ఉపవాస దీక్షలను విరమించి దాన ధర్మాలు చేశారు. బహుమతులను పంచారు. సీపీ కార్యాలయం వద్ద సీఎస్‌ఐ వెస్లి కేథడ్రల్ చర్చ్‌లో పాస్టరేట్ చైర్మన్ ఆర్ పాల్ కొమ్మాలు సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చర్చ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. క్రిస్టియన్ కాలనీలోని సీఎస్‌ఐ సెంటినరీ వెస్లి చర్చ్‌లో ఫాస్టరేట్ చైర్మన్ ఎస్ జాన్ సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జ్యోతినగర్‌లోని లూర్దుమాత చర్చ్‌లో ఫాదర్ సందేశమివ్వగా చర్చ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జగిత్యాల రోడ్, బేతేలు చర్చ్‌లో ప్రార్థనలు జరిగాయి.