Share News

బాల సాహితీవేత్త డాక్టర్‌ ‘కందేపీ’కి గ్లోబల్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు

ABN , Publish Date - Apr 02 , 2026 | 12:30 AM

విభిన్న, వినూత్న రచనలతో బా లల్లో మేధస్సును పెం చుతున్న సిరిసిల్లకు చెం దిన బాలసాహితీవేత్త డాక్టర్‌ కందేపీ రాణీప్ర సాద్‌ వంశీ గ్లోబల్‌ ఎక్స్‌ లెంట్‌ అవార్డును అందు కున్నారు.

బాల సాహితీవేత్త డాక్టర్‌ ‘కందేపీ’కి గ్లోబల్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు

సిరిసిల్ల, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి) : విభిన్న, వినూత్న రచనలతో బా లల్లో మేధస్సును పెం చుతున్న సిరిసిల్లకు చెం దిన బాలసాహితీవేత్త డాక్టర్‌ కందేపీ రాణీప్ర సాద్‌ వంశీ గ్లోబల్‌ ఎక్స్‌ లెంట్‌ అవార్డును అందు కున్నారు. బాల సాహి త్యంలో 56 పుస్తకాలు వెలువరిచిన సందర్భం గా మంగళవారం హైద రాబాదులో వంశీ ఆర్ట్‌ థియేటర్‌ వారు నిర్వహిం చిన ప్రత్యేక కార్యక్రమంలో సాహిత్యం, సాంస్కృ తిక రంగాల్లో ప్రతిభమూర్తులకు అవార్డులను అం దించారు. ఇందులో బాల సాహితీవేత్తగా డాక్టర్‌ కందేపీ రాణీప్రసాద్‌కు తెలుగు విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్‌ డాక్టర్‌ నిత్యానందరావు, దర్శకుడు రేలంగి నరసింహారావు, దూరదర్శన్‌ డైరెక్టర్‌ కామే శ్వరి, వంశీ ఆర్ట్‌ అధినేత వంశీ రామరాజులు అవా ర్డును ప్రదానం చేశారు. రాణీప్రసాద్‌ను బుధవా రం సిరిసిల్లలో మానేరు రచ యితల సంఘం, సిరిసిల్ల సాహితీ సమితి,జిల్లా రచయితల సంఘం కవులు, రచయితలు అభినందించారు.

Updated Date - Apr 02 , 2026 | 12:30 AM