బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి
ABN , Publish Date - May 21 , 2026 | 11:44 PM
ఐదేళ్లు దాటిన పిల్ల లను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని స్కూల్ కాం ప్లెక్స్ హెచ్‌ఎం గండ్ర దేవెందర్‌రావు అన్నారు. గురు వారం బడిబాటలో భాగంగా జడ్పీ ఉన్నత పాఠశాల లో అంగన్‌వాడీ టీచర్లు, మదర్స్ కమిటీతో సమా వేశం నిర్వహించారు.
పలు గ్రామాల్లో బడిబాట నిర్వహణ
ఎలిగేడు, మే 21(ఆంధ్రజ్యోతి): ఐదేళ్లు దాటిన పిల్ల లను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని స్కూల్ కాం ప్లెక్స్ హెచ్‌ఎం గండ్ర దేవెందర్‌రావు అన్నారు. గురు వారం బడిబాటలో భాగంగా జడ్పీ ఉన్నత పాఠశాల లో అంగన్‌వాడీ టీచర్లు, మదర్స్ కమిటీతో సమా వేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల లోపు బడి బయట ఉన్న పిల్లల వివరాలు అంగన్ వాడీ కేంద్రాల్లో ఆప్‌డేట్ చేయాలని సూచించారు. ప్రభుత్వ బడుల్లో కల్పిస్తున్న మౌలిక వసతులు, పదో తరగతిలో సాధించిన ఉత్తమ ఫలితాలను తెలియ జేయాలన్నారు. సర్పంచ్ కప్పల ప్రవీణ్, ఉపసర్పంచ్ ముంజం నరేష్, హెచ్‌ఎం జ్ఞానేశ్వర్, జ్యోతి, సరోజ, అంగన్‌వాడీ టీచర్లు జ్యోతి, పాల్గొన్నారు.
ముత్తారం, (ఆంధ్రజ్యోతి): బడీడు పిల్లలను ప్రభు త్వ పాఠశాలల్లో చేర్పించాలని ఓడేడు ప్రభుత్వ ప్రాథ మిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాధవి అన్నారు. ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లతో కలి సి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రైవేట్ పాఠశాలల్లో వేల రూపాయల ఫీజులు కట్టి నష్టపోవద్దని తల్లిదండ్రు లకు సూచించారు. అంగన్‌వాడీ టీచర్లు రెడ్డి రజిత, ఎం.మధుమతి తదితరులు పాల్గొన్నారు.
ఓదెల, (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల సంఖ్యను పెంచ డానికి పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని సర్పం చ్ కనికిరెడ్డి సతీష్, హెచ్‌ఎం పద్మ అన్నారు. మండల కేంద్రంలోని జీపి కార్యాలయంలో సమావేశాన్ని నిర్వ హించారు. సర్పంచ్ మాట్లాడు తూ గ్రామంలోని ఆరు నుంచి 14 యేళ్ల విద్యార్థులను పాఠశా లలో చేర్పించేం దుకు నమోదు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం ద్వారా విద్యార్థులకు ఉచితంగా అందించే సౌకర్యాలను, నాణ్య మైన విద్యను తెలిపారు.
పెద్దపల్లి రూరల్, (ఆంధ్రజ్యోతి): సమ్మర్ క్యాం పుల ద్వారా విద్యార్థుల్లో మేధాశక్తి పెంపొందుతుందని జిల్లా విద్యాధికారి శారద అన్నారు. అప్పన్నపేట్‌లోని పీఎంశ్రీ పాఠశాలను సమ్మర్ క్యాంపు లో భాగంగా డీఈవో సందర్శించారు. గేమ్స్, యోగా, డ్యాన్స్, కం ప్యూటర్ శిక్షణ తరగతులను పరిశీలించారు. డీఈవో మాట్లాడుతూ పిల్లలు సమ్మర్ క్యాంపును సద్వినియో గం చేసుకోవాలన్నారు. ప్రధానోపాధ్యాయులు పురు షోత్తం, ఆగయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.