పిల్లలు మత్తుకు బానిసలు కావొద్దు..
ABN , Publish Date - Oct 06 , 2026 | 12:36 AM
ప్రస్తుత కాలంలో పిల్లలు సెల్‌ఫో న్లు, స్ర్కీన్ క్రీడలకు అలవాటుపడి అనారోగ్యాల బారిన పడటంతో పాటు మత్తు కు బానిసలవుతూ తమ విలువైన సమయాన్ని కోల్పోతున్నారని బీసీ సంక్షేమ, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
వేములవాడ, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత కాలంలో పిల్లలు సెల్‌ఫో న్లు, స్ర్కీన్ క్రీడలకు అలవాటుపడి అనారోగ్యాల బారిన పడటంతో పాటు మత్తు కు బానిసలవుతూ తమ విలువైన సమయాన్ని కోల్పోతున్నారని బీసీ సంక్షేమ, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని నాలుగు రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్‌లు క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడాకరులతో కలిసి కబడ్డీ ఆడారు. అనంత రం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తల్లి దండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారో దృష్టిసారించాలన్నారు. సెల్‌ఫోన్‌లు, స్ర్కీన్ ఆటలు ఆడుతూ పిల్లలు తమ విలువైన సమాయాన్ని కోల్పోతున్నారని, మరికొంత మంది పిల్లలు మత్తుకు బానిసలు అయ్యే పరిస్థితి వస్తుందని వివ రించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను మైదానానికి తీసుకువెళ్లి క్రీడలవైపు దృష్టి మళ్లేలా చూడాలని కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడల్లో అగ్రగామిగా నిలి పేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. రాబోయే ఒలంపిక్స్‌లో తెలంగాణ క్రీడాకారులు దేశానికి ప్రాతినిధ్యం వహించేలా సీఎం రేవంత్‌రెడ్డి ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు పీఈటీ పోస్టుల భర్తీ, క్రీడా మైదానాల అభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పనకు చొరవ చూపుతోందని తెలిపారు. ఒలంపిక్స్ క్రీడల్లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని వేములవాడ శాసన సభ్యుడు, ప్రభు త్వ విప్ అన్నారు. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తూమ్ మధు కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.