Share News

ప్రీ ప్రైమరీలో చిన్నారులను చేర్పించాలి

ABN , Publish Date - Jan 08 , 2026 | 11:59 PM

ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూల్లలో చిన్నారులను చేర్పించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి తల్లిదండ్రులకు సూచించారు. మండలంలోని పర్లపల్లి ప్రభుత్వ పూర్వ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్‌ పమేలా సత్పతి సందర్శించారు.

ప్రీ ప్రైమరీలో చిన్నారులను చేర్పించాలి
పర్లపల్లిలోని ప్రీ ప్రైమరీ స్కూల్‌ విద్యార్థులతో కల్టెక్టర్‌ పమేలా సత్పతి

తిమ్మాపూర్‌, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూల్లలో చిన్నారులను చేర్పించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి తల్లిదండ్రులకు సూచించారు. మండలంలోని పర్లపల్లి ప్రభుత్వ పూర్వ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్‌ పమేలా సత్పతి సందర్శించారు. ఈ సందర్బంగా చిన్నారులకు యూనిఫామ్‌, పుస్తకాలు, స్టేషనరీ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 33 ప్రభుత్వ పూర్వ ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా నాణ్యమైన విద్య అందుతోందన్నారు. యూనిఫాం, పుస్తకాలు వంటివి ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు, ప్రీ ప్రైమరీ చిన్నారులకు ఉచితంగా షూస్‌ అందజేస్తామన్నారు. అనంతరం పర్లపల్లి మండల పరిషత ప్రాథమిక పాఠశాలను కలెక్టర్‌ పమేలా సత్పతి సందర్శించారు. ఈ సందర్భంగా మూడో తరగతి విద్యార్థులతో కలెక్టర్‌ పాఠాలు చదివించారు. బుధవారం బోధనను కచ్చితంగా అమలు చేయాలనికలెక్టర్‌ పమేలా సత్పతి ఆదేశించారు. కార్యక్రమంలో విద్యాశాఖ క్వాలిటీ కో ఆర్డినేటర్‌ అశోక్‌రెడ్డి, సర్పంచ సూరం స్వప్న, తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో రాజీవ్‌మల్హోత్ర, ఎంఈవో శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2026 | 11:59 PM