Share News

మహిళలకు ముఖ్యమంత్రి పెద్దపీట..

ABN , Publish Date - Feb 08 , 2026 | 01:00 AM

మహిళలకు రేవంత్‌రెడ్డి పెద్దపీట వేస్తున్నారని, మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని పీసీసీ మాజీ అధ్యక్షులు వి. హన్మంతరావు అన్నారు.

మహిళలకు ముఖ్యమంత్రి పెద్దపీట..

వేములవాడ టౌన్‌, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): మహిళలకు రేవంత్‌రెడ్డి పెద్దపీట వేస్తున్నారని, మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని పీసీసీ మాజీ అధ్యక్షులు వి. హన్మంతరావు అన్నారు. శనివా రం వేములవాడ పట్టణంలోని 4, 16, 18,19వ వార్డుల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని కల ప్రచారంలో భాగంగా ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌తో కలిసి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రమేశ్‌బా బు గెలిస్తే అసలు వేములవాడలో ఉన్నాడా అని ప్రశ్నించారు. మీకు అప్పు డు అయిన కనిపించడా... ఎప్పుడు చూడు రమేశ్‌ జర్మన్‌లో ఉన్నాడని ఆరో పించారు. రాజన్న ఆలయాన్ని రూ. 150కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. సోనియా గాంధి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని, అమరుల త్యాగాలు చూసి సోనియా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందన్నారు. సిరిసిల్లలో గతంలో ఇసుకలారీ ల వల్ల చాలామంది చనిపోయారని ఆయన ఆరోపించారు. కేటిఆర్‌ ఇసుక లారీలను అడ్డుకున్న వారిని పోలీస్‌స్టేషన్‌లో పెట్టి ధర్డ్‌ డిగ్రీ ప్రయోగించార న్నారు. పది సంవత్సరాలలో కేటిఆర్‌ ఏం అభివృద్ధి చేశారన్నారు. హైదరా బాద్‌ నుండి సిరిసిల్ల రావడానికి రోడ్డు వేసుకున్నారా అని ప్రశ్నించారు. బీసీ ఎస్సీ, ఎస్టీ అభ్యున్నతికి తోడ్పాటు నందిస్తున్నారన్నారు. మహిళలకు రేవంత్‌రెడ్డి పెద్దపీట వేస్తున్నారని, మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధులను గెలిపించాలన్నారు. రోడ్‌షోలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 08 , 2026 | 01:00 AM