Share News

పకడ్బందీగా ‘చేయూత’

ABN , Publish Date - Sep 21 , 2026 | 01:13 AM

కొత్తగా స్వీకరించిన ‘చేయూత’ పింఛన్‌ దరఖా స్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పరిశీలిస్తున్నారు. ఈ నెల 15 వరకు స్వీకరించిన దరఖాస్తులను అధికారులు ఇంటింటికి వెళ్లి అనర్హులను ముందే గుర్తించే పనిలో పడ్డారు. దరఖాస్తుల పరిశీలన కోసం 360 డిగ్రీల సాఫ్ట్‌వే ర్‌తో అనుసంధానం చేసి దరఖాస్తుదారుల సమగ్ర సమాచారం ప్రత్యేకంగా రూపొందించిన చేయూత వెరిఫికేషన్‌ మొబైల్‌ యాప్‌లో వివరాలను పొందు పరుస్తున్నారు.

పకడ్బందీగా ‘చేయూత’

- సెప్టెంబర్‌ 25లోగా దరఖాస్తుల పరిశీలన

- పాత దరఖాస్తులు 76,501 పెండింగ్‌

- జిల్లాలో 1,08,986 మంది పింఛన్‌దారులు

(ఆంరఽధజ్యోతి, సిరిసిల్ల)

కొత్తగా స్వీకరించిన ‘చేయూత’ పింఛన్‌ దరఖా స్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పరిశీలిస్తున్నారు. ఈ నెల 15 వరకు స్వీకరించిన దరఖాస్తులను అధికారులు ఇంటింటికి వెళ్లి అనర్హులను ముందే గుర్తించే పనిలో పడ్డారు. దరఖాస్తుల పరిశీలన కోసం 360 డిగ్రీల సాఫ్ట్‌వే ర్‌తో అనుసంధానం చేసి దరఖాస్తుదారుల సమగ్ర సమాచారం ప్రత్యేకంగా రూపొందించిన చేయూత వెరిఫికేషన్‌ మొబైల్‌ యాప్‌లో వివరాలను పొందు పరుస్తున్నారు. ప్రతి దరఖాస్తుదారుడి విషయంలో ‘అర్హుడు’ లేదా ‘అనర్హుడు’ అనే వివరాలను స్పష్టం గా పేర్కొనాలి. అనర్హుడిగా గుర్తిస్తే అందుకు సంబంధించిన వివరాలు కూడా పొందపరచాల్సి ఉంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతో పాటు, 260 గ్రామ పంచాయతీలో పరిధిలో అధికారులు ఆధార్‌ నెంబర్‌ ఆధారంగా సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానం చేసి వివ రాలు తెలుసుకుంటున్నారు. మూడు ఎకరాల మాగాణి, ఐదు ఎకరాల మెట్ట భూములు, ఫోర్‌ వీల్‌ వాహనాలు ఉన్నవారిని సాఫ్ట్‌వేర్‌ గుర్తిస్తుంది. క్షేత్రస్థాయిలో అధికారులు ఆధార్‌, బ్యాంకు ఖాతా, ఫొటో అవసరమైన సర్టిఫికెట్లు, చేనేత, గీత కార్మి కుల గుర్తింపు కార్డులు, వితంతువు అయితే భర్త మరణ ధ్రువీకరణ పత్రం, ఇతర వైద్య ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తున్నారు. క్షేత్రస్థాయిలో వెళ్లే అధికా రులు ఫొటోలు తీసి జీపీఎస్‌ లొకేషన్‌ నమోదు చేస్తున్నారు. ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో రూ 1.50 లక్షలు, మున్సిపల్‌ పరిధిలో రూ 2 లక్షల ఆదాయం దాటిన వారిని అనర్హులుగా గుర్తిస్తు న్నారు. సోషల్‌ ఆడిట్‌లో తప్పుడు ధ్రువీకరణ బయటపడితే వెరిఫికేషన్‌ అధికారిపై క్రమశిక్షణ చర్యలతో పాటు చెల్లించిన మొత్తం రికవరీ చేసే అవకాశం ఉండడంతో అధికారులు కూడా పూర్తి స్థాయిలో పరిశీలన జరుపుకున్నారు. దరఖాస్తుల పరిశీలన ఈ నెల 25లోపు పూర్తి పూర్తిచేసి డీఆర్డీ వోలకు పంపించాల్సి ఉంటుంది. తుది జాబితాను కలెక్టర్‌ ఆమోదించిన తర్వాత చేయూత పింఛన్‌ ఉత్తర్వులు సిద్ధమవుతాయి.

ఫ జిల్లాలో కొత్తగా 9,649 దరఖాస్తులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్తగా 9,649 మంది చేయూత పింఛన్‌ కోసం దరఖాస్తులు చేసుకు న్నారు. ఇందులో వితంతువులు 4127మంది, ఒంటరి మహిళలు 513 మంది, దివ్యాంగులు 2271 మంది, చేనేత కార్మికులు 1478 మంది, గీత కార్మికులు 1260 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి ప్రభుత్వం గత కేటగిరీల వారీగా కాకుం డా కొత్తగా తలసేమియా, సికిల్‌ సెల్‌ ఎనీమియా బాధితులకు కూడా పింఛన్‌ ఇవ్వడానికి దరఖాస్తులు కోరింది. గతంలో జిల్లాలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా స్వీకరించిన దరఖాస్తులు 1.92 లక్షలు ఉన్నాయి. ఇందులో పింఛన్ల కోసం 76,501 మంది దరఖాస్తులు చేసుకున్న వారు ఉన్నారు. ఇందులో 4,824 మంది దివ్యాంగులు దరఖాస్తులు చేసుకున్నారు.

జిల్లాలో 9,010 మంది అనర్హులు

బడుగు, బలహీన వర్గాలకు జాతీయ, సాంఘిక భద్రతా పథకం ద్వారా అందిస్తున్న చేయూత పింఛన్‌దారుల్లో మరణించిన వారికి సంబంధించిన పింఛన్‌ సొమ్ము కుటుంబ సభ్యులు పొందుతున్న సందర్భాలు ఉన్నాయి. మరోవైపు వృద్ధులు, వితం తువులు, దివ్యాంగులు వివిధ వృత్తుల్లో ఉన్నవారు పొందుతున్న చేయూత పింఛన్లలో అనర్హులను గుర్తించే దిశగా ప్రభుత్వం తాజాగా సజీవ నిర్ధారణ సర్వే లైవ్‌ అథెంటిఫికేషన్‌ నిర్వహించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్రస్థాయిలో లైవ్‌ అథెంటిఫికేషన్‌ ద్వారా నిర్ధారణ సర్వేలో ముందు వరుసలో నిలి చింది. జిల్లాలో ఇప్పటికే వంద శాతం సర్వే పూర్తి చేశారు. సర్వేలో మరణించిన వారు, స్థానికంగా ఆచూకీ లభించని పింఛన్‌ లబ్ధిదారులను గుర్తిం చారు. మృతి చెందిన వారి పింఛన్‌ లబ్ధిదారుల సొమ్మును నిలిపివేశారు. సర్వేలో 9,010 మంది అనర్హులుగా ఉన్నట్లు తేలుస్తుండగా,2836 మంది మృతి చెందిన వారు ఉన్నారు. జిల్లాలో చేయూత పథకంలో 1,08,986 వివిధ రకాల పింఛన్‌ లబ్ధిదారులు ఉన్నారు. సజీవ నిర్ధారణ సర్వేలో 99,976 మంది పింఛన్‌ లబ్ధిదారులు అర్హులగా ఉన్నారు. సర్వేలో 2,836 మంది పింఛన్‌ లబ్ధిదారు లు మృతి చెందినట్లు గుర్తించారు. వివిధ కార ణాలతో పరిశీలనలో 9,010 పింఛన్లు ఉన్నాయి. బయోమెట్రిక్‌, ఫేస్‌ రికగ్నైజేషన్‌ ద్వారా కాని వారు 2,505మంది ఉన్నారు, నిర్ధారణ కానివి 1,441 మంది, స్థానింగా లేనివారు 564 మంది, ఆధార్‌ ధ్రు వీకరణ సరిగా లేనివి 1,260 మంది ఉన్నాయి.

Updated Date - Sep 21 , 2026 | 01:13 AM