అనుమానాస్పద వాహనాల తనిఖీ
ABN , Publish Date - Jun 14 , 2026 | 12:41 AM
అనునాస్పదంగా కనిపించే వాహనాలను క్షుణంగా తనిఖీలు చేయాలని, వాహనాల డాక్యుమెంటలను పరిశీలించాలని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి ఆదేశించారు.
సిరిసిల్ల అర్బన్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి) : అనునాస్పదంగా కనిపించే వాహనాలను క్షుణంగా తనిఖీలు చేయాలని, వాహనాల డాక్యుమెంటలను పరిశీలించాలని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి ఆదేశించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం సిరిసిల్ల అర్బన్ పరిధిలోని రగుడు వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు, డ్రంకెన్ డ్రైవ్‌లను చేప ట్టారు. దీనిలో డీఎస్పీ నాగేంద్రచారి పాల్గొని క్షేత్రస్థాయిలో తనిఖీలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా విధుల్లో ఉన్న అధికారులకు, సిబ్బందికి అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తుల వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, వాహనాల డాక్యుమెంటులను పరిశీలించాలని సూచించారు. సరైన పత్రాలు లేని వాహనా లు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నంబర్ ప్లేట్లు కలిగిన వాహనాలను సీజ్ చేయాలని, మైనర్లు వాహనాలు నడుపు తున్నట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈసందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రజల్లో భద్రతాభా వాన్ని పెంపొందించడమే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యమ న్నారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి వాహనదారుడు తప్పని సరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరిం చాలని, కారులో ప్రయాణించే వారు సీటు బెల్ట్ వినియోగిం చాలని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీలల్లో టౌన్ సీఐ శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్‌ఐ సిబ్బంది పాల్గొన్నారు. అసాంఘిక శక్తులు, అనుమానిత వ్యక్తుల కట్టడి, నేరాల నివారణ కోసమే జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహి స్తున్నామని తెలిపారు. ఈ తనిఖీలకు ప్రజలందరూ సహక రించాలని డీఎస్పీ కోరారు.