ఉపాధి చట్టం మార్పుతో గ్రామీణ ప్రజలకు నష్టం
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:32 AM
ఉపాధిహామీ పథకం మార్పు చేయడం వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అన్నారు.
ఎల్లారెడ్డిపేట, జనవరి 25(ఆంధ్రజ్యోతి): ఉపాధిహామీ పథకం మార్పు చేయడం వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం గుండారం, గొల్లపల్లి గ్రామాల్లో ఏఐసీసీ పిలుపు మేరకు మహాత్మాగాంధీ నరేగా బచావో సంగ్రామం కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రం పథకం పేరు మార్పుతో పాటు నిబంధనలను మార్చడం వల్ల దేశవ్యాప్తం గా 13కోట్ల మంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉంద న్నారు. రాష్ట్రంలో 75 లక్షల మందికి పనిహక్కు పోతోందన్నారు. వలసను నివారించేందుకు తీసు కువచ్చిన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పేదలపై కక్షతో మార్చి పొట్టకొడు తుందని అన్నారు. ఉపాధిహామీ చట్టాన్ని పునరుద్ధరించాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సయ్య, మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ఏఎంసీ చైర్‌పర్సన్ సబేరాబేగం, నాయకులు సాహెబ్, శ్రీనివాస్‌రెడ్డి, గౌస్, కృష్ణమూర్తి, తిరుపతిరెడ్డి, రాములు, నాగరాజు, బాపురెడ్డి, రవీందర్, బాల్‌రెడ్డి, బాబు, కిషన్, రాములు, రాజిరెడ్డి, బుచ్చాగౌడ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.