Share News

రాజ్యాంగ హక్కులపై కేంద్ర ప్రభుత్వం దాడి

ABN , Publish Date - Jun 15 , 2026 | 12:41 AM

దేశంలో మూడోసారీ అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం పేదల రాజ్యాంగ హక్కులపై తీవ్ర దాడికి పాల్పడుతోం దని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్రి ప్రసాద్‌ అన్నారు.

రాజ్యాంగ హక్కులపై కేంద్ర ప్రభుత్వం దాడి

సిరిసిల్ల అర్బన్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి) : దేశంలో మూడోసారీ అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం పేదల రాజ్యాంగ హక్కులపై తీవ్ర దాడికి పాల్పడుతోం దని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్రి ప్రసాద్‌ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో అదివారం తెలం గాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మూడవ మహా సభలను నిర్వహించారు. జిల్లా నాయకులు గురిజాల శ్రీధర్‌ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో ముందుగా అమరవీరుకుల మౌనం పాటించారు. అనంతరం జిల్లా కార్యదర్శి గన్నేరం నర్సయ్య నివేధికను ప్రవేశపెట్టారు.ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్‌ మాట్లాడుతూ వంట గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటడంతో నిత్యావసర సరుకుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయన్నారు. ప్రజలపై భారం పడుతుందన్నారుర. గ్రామీణుల ఆర్థిక భారం తగ్గించడం లో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. యూపీఏ హయాంలో తీసుకొచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం పేదలకు ఉపాధి భద్రత కల్పించిం దని, దానిని బలహీనపరిచే విధంగా మార్పులు తీసుకు రావడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఉపాధిహామీ పథ కాన్ని యథావిధిగా అమలు చేయాలని డిమాండ్‌ చేశా రు. ఎన్నికల కమిషన్‌ పేరుతో పౌరుల పౌరసత్వాన్ని నిర్ణయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, మతాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందే ప్రయ త్నాలు జరుగుతున్నాయన్నారు. విద్యుత్‌ సంస్కరణల చట్టంతో ఉచిత విద్యుత్‌కు ముప్పు వాట్లిలే ప్రమాదం ఉందన్నారు. కార్మిక హక్కులను దెబ్బతీసే విధంగా లేబ ర్‌ కోడ్‌లను తొలగించడం అన్యాయన్నారు. వ్యవసాయ కార్మికుల జీవన పరిస్థితులు రోజురోజకు దుర్భరంగా మారుతున్నాయని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేత నాలు పెరగడం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యాం త్రీకరణ పెరగడంతో ఉపాధి అవకాశాలు తగ్గి, వ్యవసా య కూలీలు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభు త్వం ఎన్నికల సమయంలో వ్యవసాయ కార్మికు లకు ఇచ్చిన హామీలైన భూములు లేని కార్మికులకు ఆర్థిక సహాయం, కౌలు రైతు లకు మద్దతు, మహిళలకు ఆర్థిక భరోసా, పట్టణ పేదలకు ఉపాధి విస్తరణ, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్ల పెంపు వంటి హామీలను ఇప్పటికీ అమలు చేయ లేదని విమర్శించారు.సాగుభూమి, కనీస వేతనాల సాధన కోసం వ్యవసాయ కార్మి కులు ఉద్యమించాలన్నారు. ఈ మహాసభలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సైల్కాబ్‌, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మూషం రమేష్‌, పెద్ద లింగాపూర్‌ గ్రామ సర్పంచ్‌ గన్నేరం వసంత సీఐటీయూ జిల్లా అధ్య క్ష,కార్యదర్శులు ఎగమంటి ఎల్లారెడి, కోడం రమణ ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆడెపు రజిత, జవ్వాజి విమ ల కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి నాగరాజు బీడీ కా ర్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సూరం పద్మ శ్రీరాముల రమేష్‌ చంద్ర, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామంచ అశోక్‌ సీఐటీయూ నాయకులు అన్నల్‌ దాస్‌ గణేష్‌ ఎలిగేటి రాజశేఖర్‌, బండ రవి, మాధురి, మాధ వి, సురేష్‌, దేవదాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 15 , 2026 | 12:41 AM