కేంద్ర ప్రభుత్వ తీరుతో ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం
ABN , Publish Date - May 07 , 2026 | 01:04 AM
ధాన్యం కొను గోలులో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనలతో ఆలస్యం జరిగిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి, మే 6 (ఆంధ్రజ్యోతి) : ధాన్యం కొను గోలులో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనలతో ఆలస్యం జరిగిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం రాత్రి జగిత్యాల జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని మంత్రి లక్ష్మణ్ కుమార్ బుధ వారం ఉదయం పరిశీలించారు. ధర్మపురి మార్కె ట్ యార్డులో తడిసిన వరి ధాన్యం, మొక్క జొన్నలను మంత్రి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడు తూ ధాన్యం కొనుగోలు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ విధానాన్ని తీసుకు వచ్చింద న్నారు. ఆన్‌లైన్‌లో ట్రక్ షీట్‌తో పాటు ధాన్యం తరలిస్తున్న వాహనాలకు జీపీఆర్‌ఎస్ వంటి సాంకేతిక సమస్యలతో కొనుగోలు 15 రోజులు ఆలస్యంగా ప్రారంభమైనట్లు మంత్రి వివరించారు. కేంద్రం తెచ్చిన నిబంధనలతో రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాత పద్ధతిలో ధాన్యం కొనుగోలుకు ఆదేశాలు జారీ చేశారన్నారు. వారం, పది రోజుల్లో మార్కెట్ యార్డుల్లో ఉన్న ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు పూర్తి చేస్తామన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని, ప్రతి గింజ కొనుగోలు చేసే బాధ్యతను తాను తీసుకుంటానని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈకార్య క్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగ నభట్ల దినేష్, చిలుముల లక్ష్మణ్, వేముల రాజు, సౌళ్ల నరేష్, చీపురుశెట్టి రాజేష్ తదితరులు ఉన్నారు.