Share News

విద్యార్థుల ఉద్యమంతో దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం

ABN , Publish Date - Jul 26 , 2026 | 12:07 AM

విద్యార్థుల ఉద్యమంతో కేంద్రప్రభుత్వం దిగొచ్చి, కేంద్రవిద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశాడని కాంగ్రెస్‌ కార్పొరేషన్‌ అధ్యక్షుడు, కార్పొరేటర్‌ వైద్యుల అంజన్‌కుమార్‌ అన్నారు.

విద్యార్థుల ఉద్యమంతో దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం

కరీంనగర్‌ అర్బన్‌, జూలై15 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల ఉద్యమంతో కేంద్రప్రభుత్వం దిగొచ్చి, కేంద్రవిద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశాడని కాంగ్రెస్‌ కార్పొరేషన్‌ అధ్యక్షుడు, కార్పొరేటర్‌ వైద్యుల అంజన్‌కుమార్‌ అన్నారు. శనివారం సాయంత్రం కరీంనగర్‌ రాజీవ్‌చౌక్‌ నుంచి కార్ఖానగడ్డలోని గాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంజన్‌కుమార్‌ మాట్లాడుతూ.... కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా ఆమోదంపొందే వరకు, విద్యార్థుల పెండింగ్‌ సాధన కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. అమరులైన విద్యార్థులను కేంద్రప్రభుత్వం ఆదుకోవాలన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కరీంనగర్‌ అసెంబ్లీ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు, సుడా మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, ఊట్కూరి నరేందర్‌రెడ్డి, ఏఎంసీ ఛైర్మన్‌ ఆకుల నర్సయ్య, కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్‌, పర్వతం మల్లేశం, కాంతాల జగన్‌రెడ్డి, నునావత్‌ భాస్కర్‌నాయక్‌, వరాల నర్సింగం, అర్బన్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ గడ్డం విలాస్‌రెడ్డి, మడుపు మోహన్‌, కర్ర సత్యప్రసన్నరెడ్డి, కర్ర రాజశేఖర్‌, చాడగొండ బుచ్చిరెడ్డి, పడాల అజయ్‌, సరిల్ల ప్రసాద్‌, కల్లెపల్లి బాలరాజు, గుండాటి శ్రీనివాస్‌రెడ్డి, అబ్దుల్‌ రహమాన్‌, కిమ్‌ ఫహద్‌, చర్ల పద్మ పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2026 | 12:07 AM