పకడ్బందీగా జనగణన చేపట్టాలి
ABN , Publish Date - Mar 23 , 2026 | 11:39 PM
ప్రభుత్వ పథకాలను రూపకల్పనకు, వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేం దుకు జనగణన చాలా ఉపయోగపడుతుందని, జనగణన-2027 ను ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
సిరిసిల్ల, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పథకాలను రూపకల్పనకు, వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేం దుకు జనగణన చాలా ఉపయోగపడుతుందని, జనగణన-2027 ను ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జనగణన-2027లో భాగంగా సెన్సస్ మానిటరింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్, మొబైల్ యాప్, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో హౌస్ లిస్టింగ్, బ్లాక్స్ డిజిటల్ విధానంలో సిద్ధం చేయడం, ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్ల నియామకం తదితర అంశాలపైపై చార్జ్ అధికారులు, సహాయకులు, సాంకేతిక సహా యకులకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భం గా కలెక్టర్ మట్లాడుతూ రాష్ట్రంలో డిజిటల్ విధానంలో జరిగే మొదటి జనగణనగా వెల్లడించారు. మొదటి దశలో మే 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు ఇళ్ల గణన నిర్వహిస్తారని, రెండో దశ 2027 ఫిబ్రవరిలో వ్యక్తుల వారిగా సమాచారం సేక రిస్తారని తెలిపారు. ప్రభుత్వ పథకాలను రూపకల్పనకు, వివిధ సంక్షే మ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు జనగణన చాలా ఉపయోగ పడుతుందని తెలిపారు. ఆరోగ్య, అక్షరాస్యత, జనాభా, లింగ నిష్పత్తి, వలసలు, ఉపాధి నివాస స్థితి తదితర అంశాల వివరాలు జనగణనతో ప్రభుత్వం వద్ద ఉంటాయని వెల్లడించారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని బాధ్యతల నిర్వహణలో ఎంతో కీలకమని స్పష్టం చేశారు. వివరాలు పక్కాగా సేకరించి నమోదు చేయించాలని ఆదేశించారు. శిక్షణలో జిల్లా ప్రణాళిక అధికారి శ్రీనివాసాచారి, గణాంక అధికారి సంపత్, డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్ నుంచి స్టాటిస్టికల్ ఇన్వెస్టిగే టర్స్ శ్రేయ, శిరీష తదితరులు పాల్గొన్నారు.