Share News

జన గణన సమాచారం పక్కాగా సేకరించాలి

ABN , Publish Date - Oct 23 , 2026 | 12:14 AM

జన గణన సమాచారం క్షేత్రస్థాయిలో నాణ్యతతో పక్కాగా సేకరించాలని కలెక్టర్‌ గరిమ అగ్ర వాల్‌ ఆదేశించారు.

జన గణన సమాచారం పక్కాగా సేకరించాలి

సిరిసిల్ల, అక్టోబరు 22 (ఆంరఽధజ్యోతి): జన గణన సమాచారం క్షేత్రస్థాయిలో నాణ్యతతో పక్కాగా సేకరించాలని కలెక్టర్‌ గరిమ అగ్ర వాల్‌ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో భారత జనగణన-2027 భాగంగా రెండో దశ జనాభా గణన నిర్వహణపై ఛార్జ్‌ ఆఫీసర్లు తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు, అదనపు ఛార్జ్‌ ఆఫీసర్లు ఎంపీడీవోలకు శిక్షణ కార్యక్ర మాన్ని నిర్వహించారు. జనాభా గణన రెండో దశను సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, క్షేత్రస్థాయిలో గణన ప్రక్రియ అమలు, గణన సిబ్బంది విధులు, బాధ్యతలు, జనాభాకు సంబంధించిన వివరాల ఖచ్చితమైన సేకరణ, సమాచార నమోదు, సంబంధిత మార్గదర్శకాల అమలు తదితర అంశాలపై అధికారులకు అవగాహన కల్పిం చారు. కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడుతూ ఎన్యూమరేటర్ల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వార్డు ఆఫీసర్ల నుంచి వివరాలు సేకరించి హౌస్‌ లిస్టింగ్‌ బ్లాక్‌ల ఆధునీకరణ పూర్తి చేయాలని సూచించారు. 800 కంటే జనాభా ఎక్కువ ఉంటే నూతన ఎన్యూమరేష న్‌ బ్లాక్‌ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. జనాభా గణన అత్యంత ప్రాధాన్యత కలిగిన జాతీయ కార్యక్రమమని, ఈ ప్రక్రియలో పొర పాట్లకు తావులేకుండా ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి సంబంధించిన 40 ప్రశ్నలతో కూడిన వివరా లను నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ఛార్జ్‌ అధికారులు, అదనపు ఛార్జ్‌ అధికారులు తమ పరి ధిలోని గణన సిబ్బందికి అవ సరమైన సూచనలు అంది స్తూ, శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలుచేయాలని తెలిపారు. అన్ని సంబంధిత శాఖల అధికారులు సమన్వ యంతో పనిచేస్తూ, జనగణన-2027 రెండో దశ జనాభా గణనను విజయవంతంగా పూర్తి చేసేందుకు కృషిచేయాలని సూచించారు. కార్య క్రమంలో జిల్లా జనగణన అధికారి ముఖ్య ప్రణాళిక అధికారి సంపత్‌ కుమార్‌, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి వీరభద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2026 | 12:14 AM