Share News

కరీంనగర్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వ వెయ్యి రోజుల ప్రజా పాలన సంబరాలు

ABN , Publish Date - Sep 05 , 2026 | 12:21 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో 1,000 రోజుల ప్రజా పాలన-ప్రజా సంక్షేమ దినోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం కరీంనగర్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు వైద్యుల అంజన్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్‌ వద్ద సంబరాలు.

కరీంనగర్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వ వెయ్యి రోజుల ప్రజా పాలన సంబరాలు

కరీంనగర్‌ అర్బన్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో 1,000 రోజుల ప్రజా పాలన-ప్రజా సంక్షేమ దినోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం కరీంనగర్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు వైద్యుల అంజన్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్‌ వద్ద సంబరాలు నిర్వహించి, నగరంలోని ప్రధాన వీధుల గుండా భారీ బైక్‌ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ ఇందిరా చౌక్‌ నుంచి ప్రారంభమై రాజీవ్‌చౌక్‌, గాంధీచౌక్‌, బాబు జగ్జీవన్‌రావ్‌ చౌక్‌ మీదుగా అంబేద్కర్‌ చౌక్‌ వరకు సాగింది. ఈ సందర్భంగా వైద్యుల అంజన్‌కుమార్‌, ఇతర నాయకులు మాట్లాడుతూ... కాంగ్రెస్‌ ప్రజా పాలనలో ప్రతి పథకం పారదర్శకంగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ నేరుగా చేరుతోందన్నారు. గత పాలనలో మాదిరిగా ఫామ్‌ హౌస్‌ పాలన కాద ని, ఇది ప్రజల గడప వద్ద పాలనగా పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు మల్లేశం, ఏఎంసీ చైర్మన్‌ ఆకుల నర్సయ్య, కాంగ్రెస్‌ కరీంనగర్‌ అసెంబ్లీ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌, మాజీ సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, అల్ఫోర్స్‌ నరేందర్‌రెడ్డి, పురుమల్ల శ్రీనివాస్‌, ఆకారపు భాస్కర్‌రెడ్డి, ఎండీ తాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2026 | 12:21 AM